యాప్నగరం

పళనిస్వామి, పన్నీర్‌సెల్వం కలిసిపోనున్నారా ?

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మృతి అనంతరం సీఎం పదవిని చేజిక్కించుకోవడం కోసం ఏఐఏడీఎంకే...

TNN 18 Aug 2017, 8:19 pm
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మృతి అనంతరం సీఎం పదవిని చేజిక్కించుకోవడం కోసం ఏఐఏడీఎంకే పార్టీలో ఏర్పడిన పోటీ కారణంగా రెండు వర్గాలుగా విడిపోయిన ఆ పార్టీ ఈరోజు మళ్లీ ఒక్కటి కానుందా అంటే అవుననే అంటున్నాయి తమిళనాట రాజకీయవర్గాలు. మాజీ సీఎం పన్నీర్ సెల్వం విధించిన షరతులకి ప్రస్తుత ముఖ్యమంత్రి ఇడప్పాడి కే పళనిస్వామి అంగీకరించారు. దీంతో ఇవాళ చెన్నై బీచ్‌లోని జయలలిత మెమోరియల్ వద్ద ఈ ఇద్దరూ కలుసుకోనున్నారు. అనంతరం ఇద్దరూ కలిసి పార్టీ ఆఫీస్‌కి బయల్దేరతారని తెలుస్తోంది.
Samayam Telugu palaniswamy and panneerselvam may announce merger today
పళనిస్వామి, పన్నీర్‌సెల్వం కలిసిపోనున్నారా ?


అంతకన్నా ముందుగా ఇవాళ ఉదయం ఇరువురు నేతలు ఎవరికి వారే వేర్వేరుగా తమ తమ వర్గానికి సంబంధించిన నేతలతో సమావేశమై భవిష్యత్ రాజకీయ పరిణామాలపై చర్చించారు. పన్నీర్ సెల్వం నిర్వహించిన సమావేశానికి మాజీ మంత్రులు కేపీ మునుస్వామి, కే పాండ్యరాజన్‌తోపాటు ఎమ్మెల్యేలు, ఎంపీలు హాజరయ్యారు. ప్రస్తుతం పన్నీర్ సెల్వంకి 10 మంది ఎమ్మెల్యేలు, దాదాపు 12 మంది ఎంపీల మద్దతు వుంది.

ఇదిలావుంటే, మరోవైపు ఇదే ఏఐఏడీఎంకే పార్టీ నుంచి మూడో వర్గంగా విడిపోయిన టీటీవీ ధినకరణ్ ఇవాళ తన కుటుంబంతో కలిసి వెళ్లి బెంగుళూరులో జైల్లో వున్న తన మేనత్త శశికళని కలిశారు. ధినకరణ్‌కి అండగా నిలిచిన మద్దతుదారులు మాత్రం చెన్నైలోని ఓ హోటల్లో సమావేశమై తమ వర్గం నేతలతో సంప్రదింపులు, సమాలోచనలు జరిపారు. దీంతో తమిళనాడులో రాజకీయాలు ఎప్పుడు, ఏ మలుపు తిరుగుతాయో తెలియని పరిస్థితి నెలకొని వుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.