యాప్నగరం

పంచకుల అల్లర్లపై హైకోర్టు కీలక ఆదేశాలు

అత్యాచారం, హత్య కేసులో బాబా గుర్మీత్‌ రామ్‌ రహీమ్‌ సింగ్‌‌ను దోషిగా ప్రకటించిన అనంతరం హింసాత్మక ఘటనల చెలరేగడంతో 28 మంది ప్రాణాలు కోల్పోగా అనేక మంది గాయపడ్డారు.

TNN 25 Aug 2017, 7:31 pm
అత్యాచారం, హత్య కేసులో బాబా గుర్మీత్‌ రామ్‌ రహీమ్‌ సింగ్‌‌ను దోషిగా ప్రకటించిన అనంతరం హింసాత్మక ఘటనల చెలరేగడంతో 28 మంది ప్రాణాలు కోల్పోగా అనేక మంది గాయపడ్డారు. ఆందోళన కారులు ప్రభుత్వ కార్యాలయాలు, వాహనాలు, రైల్వే స్టేషన్లను లక్ష్యంగా చేసుకుని దాడులు నిర్వహించడంతో అస్తి నష్టం సంభవించింది. ఈ నేపథ్యంలో పంజాబ్‌, హరియాణా ఉమ్మడి హైకోర్టు కీలక ఆదేశాలు జారీచేసింది. తీర్పు అనంతరం చోటుచేసుకున్న హింసాత్మక ఘటనల వల్ల జరిగిన నష్టాన్నిపూడ్చేందుకు గుర్మీత్‌ ఆస్తులను వినియోగించాలని సూచించింది. ఇందుకు గాను ఆయన ఆస్తులను జప్తు చేయాలని ఆదేశించింది. దీనికి బాధ్యత ఎవరు వహిస్తారని హైకోర్టు ప్రశ్నించింది.
Samayam Telugu panchkula violence panjab and haryana highcourt serious
పంచకుల అల్లర్లపై హైకోర్టు కీలక ఆదేశాలు


మరోవైపు ఢిల్లీలోని తొమ్మిది ప్రాంతాల్లో అల్లర్లు చెలరేగాయి. దీంతో ఢిల్లీ పోలీసులు భద్రతను మరింత పటిష్ఠం చేశారు. పంజాబ్‌లోని అనేక ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించారు. హరియాణా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టార్ అధికారులతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి హింసాత్మక ఘటనలు ఇతర ప్రాంతాలకు వ్యాపించకుండా చర్యలు తీసుకోవాలని అధికారులు ఆదేశించారు. పరిస్థితి అదుపులోనే ఉందని హరియాణా డీజీపీ ప్రకటించారు. ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ సీఎం మనోహర్ లాల్ ఖట్టార్ రాజీనామా చేయాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.

అత్యాచారం, హత్య కేసులో గుర్మీత్‌ రామ్‌ రహీమ్‌ సింగ్‌ను పంచకుల సీబీఐ కోర్టు దోషిగా తేల్చిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన మద్దతుదారులు సంయమనం కోల్పోయి విధ్వంసానికి పాల్పడ్డారు. దీంతో పంజాబ్‌, హరియాణా రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో అదనపు బలగాలను కేంద్రం ఇరు రాష్ట్రాలలో మొహరించింది. యూపీలోని ముజఫర్‌నగర్, భాగ్‌పత్ ప్రాంతాల్లోనూ 144 సెక్షన్ విధించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.