యాప్నగరం

జయలలిత మృతి కేసు: ఎయిమ్స్‌ వైద్యులకు సమన్లు..

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలితను చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో పర్యవేక్షించిన ముగ్గురు ఎయిమ్స్‌ డాక్టర్లకు రిటైర్డ్‌ జడ్జి అర్ముగస్వామి నేతృత్వంలోని విచారణ కమిషన్ సమన్లు జారీ చేసింది. ఆగస్టు 23, 24 తేదీల్లో విచారణకు హాజరు కావాలంటూ ఆదేశించింది.

Samayam Telugu 18 Aug 2018, 6:52 pm
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలితను చెన్నై అపోలో ఆస్పత్రిలో పర్యవేక్షించిన ముగ్గురు ఎయిమ్స్‌ డాక్టర్లకు రిటైర్డ్‌ జడ్జి అర్ముగస్వామి నేతృత్వంలోని విచారణ కమిషన్ సమన్లు జారీ చేసింది. ఆగస్టు 23, 24 తేదీల్లో విచారణకు హాజరు కావాలంటూ ఆదేశించింది. జయలలిత మరణం వెనుక గల కారణాలు తెలుసుకునేందుకు తమిళనాడు ప్రభుత్వం సెప్టెంబరు 2017లో మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఆర్ముగస్వామి నేతృత్వంలో ఏకసభ్య కమిషన్‌ను ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో కమిషన్ నుంచి ముగ్గురు వైద్యులకు సమన్లు జారీ అయ్యాయి.
Samayam Telugu jaya


జయలలిత 2016, డిసెంబర్ 5న అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో ఢిల్లీ నుంచి చెన్నైకి వచ్చిన ఎయిమ్స్ వైద్యులు జీసీ ఖిల్ననీ (పల్మనాలజీ విభాగం), అంజన్‌ త్రిఖా (ఎనిస్థీయాలజీ), నితీష్‌ నాయక్‌ (కార్డియాలజీ) ఆమెకు అందుతున్న చికిత్సను పరిశీలించారు. సెప్టెంబరు 22, 2016న జయలలిత ఆస్పత్రిలో చేరినప్పటి నుంచి డిసెంబరు 5, 2016న మరణించే వరకు ఆమె ఆరోగ్య పరిస్థితిని ఈ ముగ్గురు వైద్య నిపుణుల బృందం పర్యవేక్షించింది.

చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో జయలలితకు అందిన చికిత్సపై అనుమానాలు నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా జయలలిత నెచ్చెలి శశికళ.. పార్టీ నేతలు సహా ఎవ్వరినీ జయతో కలవనివ్వలేదు. ఈ నేపథ్యంలో పలు వదంతులు రావడంతో తమిళనాడు ప్రభుత్వం మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఆర్ముగస్వామి నేతృత్వంలో ఏకసభ్య కమిషన్‌ను నియమించింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.