యాప్నగరం

పెళ్లి చేస్తామంటే ఎన్నికల్లో పోటీకి దిగిన ధీర

ఆ ఏరియాలో ఆడపిల్లలకు ‘స్వాతంత్యం’ అంతంతమాత్రమే. సాయంత్రం ఆరు దాటిందంటే ఇంటిగడప దాటకూడదు.

Samayam Telugu 9 Feb 2017, 11:21 am
ఆ ఏరియాలో ఆడపిల్లలకు ‘స్వాతంత్యం’ అంతంతమాత్రమే. సాయంత్రం ఆరు దాటిందంటే ఇంటిగడప దాటకూడదు. ఉదయం బయటికెళ్లాలన్నా..మగతోడు తప్పనిసరి. పెళ్లీడుకొచ్చిన అమ్మాయిలకైతే మరి కష్టం. పెళ్లి చేసి పంపాలని తల్లిదండ్రులు చూస్తుంటారు. ఎవరిని తప్పు పట్టలేం. పరిస్థితులు అలాంటివి. ఇది ఉత్తర్ ప్రదేశ్ లోని ఫతేపూర్ సిక్రి అసెంబ్లీ నియోకవర్గంలోని మెజార్టీ గ్రామాల పరిస్థితి.
Samayam Telugu parents wanted to marry her off vandana is fighting elections instead in up
పెళ్లి చేస్తామంటే ఎన్నికల్లో పోటీకి దిగిన ధీర


నియోజకవర్గ కేంద్రానికి 40కిలోమీటర్ల దూరంలో ఉండే నగ్ల బ్రాహ్మణ్ అనే ఊరులో కట్టుబాట్లు ఎక్కవ. ఇదే గ్రామానికి 25 ఏళ్ల వందనాశర్మకు పెళ్లి చేయాలని ఆమె తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యులు కొంతకాలం నుంచి పట్టుబడుతున్నారు. సంబంధాలు చూస్తున్నారు. డిగ్రీ వరకు చదివిన ఆమె మాత్రం...స్థానికంగా ఉన్న సమస్యలు పరిష్కరించాలని, మౌలిక వసతుల కల్పన కోసం పోరాడాలని భావించేది.
తమ ఓట్లతో ఎన్నికల్లో గెలిచే నేతలు..అధికారం దక్కాక తమవైపు కన్నెత్తికూడా చూడటం లేదని ఆవేదన చెందిన వందన...తానే ఎన్నికల్లో బరిలో నిలవాలని నిర్ణయించుకుంది. తన మనసులోని మాట ఇంట్లోవాళ్లకు చెబితే వద్దన్నారు. బెదిరించారు. అయినా అవేమీ ఖతారు చేయకుండా..తన దగ్గరున్న రూ.40వేలతో రూ.10వేలతో నామినేషన్ దాఖలు చేసింది. మిగతా నగదును ‘ఎసెట్స్’ కింద చూపించింది.
నామినేషన్ దాఖలు చేసిన తెల్లారి నుంచే ఇంటింటికి తిరిగి ప్రచారం చేస్తోంది. తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే నియోజకవర్గానికి ఏం చేస్తానని చెబుతోంది.

‘‘మా అమ్మానాన్నలు నాకు పెళ్లి చేయాలని నిర్ణయించారు. ఇది నా చివరి ప్రయత్నం. కానీ, నాకు నేనుగా ఏదో ఒకటి చేయాలి. మా గ్రామంలో కనీస వసతులు లేవు. దగ్గరల్లో కాలేజీ లేదు. బాలికలు బయటికివెళ్లాలంటే మగవారు తోడుండాల్సిందే. సాయంత్రం 6దాటాక మేం బయటికి వెళ్లరాదు. 21శతాబ్దంలో ఉన్న మనం చాలా మారాల్సిన అవసరం ఉంది’’ అని వందన చెబుతోంది.

ఈ నెల 11న ఫతేపూర్ సిక్రి నియోజకవర్గానికి పోలింగ్ జరుగుతుంది. ఇంటింటికి తిరిగి వినూత్నంగా ప్రచార చేస్తున్న వందనకు మహిళలు, యువకుల నుంచి మద్దతు లభిస్తోంది. ‘‘నేను ఖచ్చితంగా వందనకే ఓటేస్తా. మకోసం పనిచేస్తానని చెబుతున్న వందనకు మద్దతుగా ప్రచారం చేస్తా’’ అని ఓ మహిళ చెబుతోంది.

నామినేషన్ దాఖలు చేసిన తెల్లారి నుంచి వందనతో మాట్లాడటం కూడా మానేసిన ఆమె కుటుంబ సభ్యులు ఒక్కొక్కరుగా ఆమెకు అండగా నిలుస్తున్నారు. ఆమె చిన్న తమ్ముడు సుశీల్ శర్మ మద్దతుగా నిలిచాడు. అక్క ప్రజల కోసం పడే తపనను చూసి ఆమెను గెలిపించాలని ప్రచారం చేస్తున్నాడు.

వేలకోట్ల రూపాయలు ఖర్చు చేసిన పోటీలో నిలబడ్డ వారికే సవాల్ చేస్తున్న స్వతంత్ర అభ్యర్థి వందన ఎన్నికల్లో గెలవకపోవచ్చు. కానీ...ఒక మహిళగా, ధైర్యంగా బరిలో నిలిచి అందరిని మనసులు ముఖ్యంగా మహిళల మనసులు గెలిచింది. ఏలాంటి ‘రాజకీయాలు’ లేకుండా పోలింగ్ సాగితే వందనకే వన్ సైడ్ గా ఓటేయవచ్చు!

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.