యాప్నగరం

ఓబీసీ(స‌వ‌ర‌ణ‌) బిల్లుకు పార్ల‌మెంటు ఆమోదం

వెనుకబడిన తరగతుల నేషనల్ కమిషన్‌కు (ఎన్‌సీబీసీ) రాజ్యాంగ హోదాను కల్పించే 123వ రాజ్యాంగ సవరణ బిల్లును రాజ్యసభ సోమవారంనాడు ఆమోదించింది.

Samayam Telugu 7 Aug 2018, 8:40 am
వెనుకబడిన తరగతుల నేషనల్ కమిషన్‌కు (ఎన్‌సీబీసీ) రాజ్యాంగ హోదాను కల్పించే 123వ రాజ్యాంగ సవరణ బిల్లును రాజ్యసభ సోమవారంనాడు ఆమోదించింది. ఇప్పటికే ఈ బిల్లును లోక్‌సభ ఆమోదించింది. ఇప్పుడు పెద్దలసభ కూడా ఆమోదించడంతో బిల్లుకు పార్లమెంటు ఆమోదం లభించినట్టయింది.
Samayam Telugu కీల‌క బిల్లును ఆమోదించిన రాజ్యసభ


తాజా బిల్లు ప్రకారం వెనుకబడిన తరగతుల వారిని చేర్చడం, లేదా తొలగించాలనే అభ్యర్థలను పరిశీలించడం, ఇందుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి సూచనలిచ్చే అధికారం నేషనల్ కమిషన్‌కు లభిస్తుంది. గత మంగళవారంనాడే లోక్‌సభలో ఈ బిల్లు ఏకగ్రీవంగా ఆమోదం పొందింది. సభకు హాజరైన వారంతా బిల్లుకు అనూకూలంగా ఓటేయడంతో మూడింట రెండొంతులకు పైగా మెజారిటీతో బిల్లుకు ఆమోదం లభించింది.

వెనుకబడిన కులాల సంక్షేమానికి మోదీ సర్కార్‌ కట్టుబడిందనే సంకేతాలను పంపుతూ ఇతర వెనుకబడిన తరగతుల (ఓబీసీ) ప్రయోజనాలను పరిరక్షించేలా, వారి హక్కులను కాపాడేందుకు పూర్తి అధికారాలను ఎన్‌సీబీసీకి కట్టబెడుతూ దానికి రాజ్యాంగ హోదా కల్పించే బిల్లును ఆమోదింపచేయడం ప్రభుత్వ విజయంగా బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. ఈ బిల్లుకు రాజ్య‌స‌భ‌లో ఆమోదం ల‌భించ‌డంపై బీజేపీ అధ్య‌క్షుడు అమిత్‌షా హర్షం వ్యక్తం చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.