యాప్నగరం

ఫ్లైట్ గాల్లో ఉండగా ప్రయాణికుడికి గుండెపోటు..!

కన్నూరు నుంచి దుబాయ్ వెళ్తున్న ఫ్లైట్‌లోని ఓ ప్రయాణికుడికి గుండెపోటు వచ్చింది. దాదాపుగా శ్వాస ఆగిపోయింది. అయితే విమాన సిబ్బంది చేసిన పనితో ఆయన ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. అదే విమానంలో ఓ డాక్టర్ ఉండడంతో ఆయనకు సీపీఆర్ చేసి గుండె కొట్టుకునేలా చేశారు. తర్వాత ఆక్సిజన్ వ్యవస్థపై ఉంచి.. ప్రాణాలను కాపాడారు. ఒకరి ప్రాణాలను కాపాడినందుకు విమాన సిబ్బందికి సంస్థ నగదు బహుమతి ప్రకటించింది. ఆ డాక్టర్‌కు కూడా ఉచితంగా ప్రయాణించడానికి టికెట్ ఆఫర్ చేసింది.

Authored byAndaluri Veni | Samayam Telugu 27 May 2022, 7:33 pm
విమానం గాల్లో ఉంటుండగా ఓ ప్రయాణికుడికి గుండెపోటు వచ్చింది. అతడిని రక్షించేందుకు విమాన సిబ్బంది సమస్ఫూర్తితో వ్యవహరించారు. దాంతో ఆయన ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. దాంతో ఆ సిబ్బంది అందరూ మెచ్చుకుంటున్నారు. యూనస్ రేయన్‌‌రోత్ కన్నూరు నుంచి దుబాయ్‌ వెళ్తున్న వాడియా గ్రూప్‌కు చెందిన విమానం ఎక్కారు. అయితే ప్రయాణం మధ్యలో ఆయనకు హార్ట్ ఎటాక్ వచ్చింది.
Samayam Telugu ఫ్లైట్ గాల్లో ఉండగా ప్రయాణికుడికి గుండెపోటు


ఛాతిలో నొప్పి రావడంతో యూనస్ బాధతో అరిచారు. ఆయన కేకలు విన్న గో ఫస్ట్ కేబిన్ సిబ్బంది అతనికి దగ్గరకు వెళ్లారు. కానీ అప్పటికే ఆయన శ్వాస ఆగిపోయి, అపస్మారక స్థితికి వెళ్లిపోయాడు. సిబ్బంది వెంటనే అప్రమత్తమై CPR ప్రక్రియను ప్రారంభించారు. అయితే అదే ఫ్లైట్‌లో డాక్టర్ షబర్ అహ్మద్ ఉండడంతో యూనస్‌ను కాపాడేందుకు ఆయన కూడా ప్రయత్నించారు. ఏఈడీతో రెండు షాకులు ఇచ్చి.. సీపీఆర్‌ పద్ధతిని పాటించారు. దాంతో గుండె కొట్టుకోవడం ప్రారంభమై వ్యక్తికి మెలకువ చ్చింది. వెంటనే విమానంలోని ఆక్సిజన్ వ్యవస్థపై యూనస్‌ను ఉంచారు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి ఎప్పటికప్పుడు అప్‌డేట్‌లను కాక్‌పిట్ సిబ్బందికి సమాచారం అందించారు.

విమానం దుబాయ్‌లో ల్యాండ్ అయిన తర్వాత యూనస్ రేయన్‌రోత్‌ను వీల్‌చైర్‌లో కూర్చోబెట్టి కిందకు దించి.. తర్వాత ఆస్పత్రికి తరలించారు. ప్రయాణికుడిని కాపాడడ్డంలో సమయస్ఫూర్తిని ప్రదర్శించిన విమాన సిబ్బందికి గో ఫస్ట్‌ విమాన సంస్థ నగదు బహుమతిని ప్రకటించింది. అలాగే గుండెపోకు గురైన యూనస్‌కు, అతడిని కాపాడిన డాక్టర్ సబర్ అహ్మద్‌కు దేశ, విదేశాల్లో ప్రయాణించేందుకు ఉచిత టికెట్‌ను ఆఫర్ చేసింది. ఏదిఏమైనా ప్రయాణికుడిని రక్షించిన విమాన సిబ్బందిపై అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.