యాప్నగరం

అమరవీరుల పిల్లల కోసం ‘పతంజలి స్కూల్’

దేశం కోసం ప్రాణాలర్పించిన అమర జవానుల పిల్లల కోసం ‘పతంజలి ఆవశ్య సైనిక్ స్కూల్’ను ఏర్పాటు చేయనున్నట్లు యోగ గురు, పతంజలి సహవ్యవస్థాపకుడు బాబా రాందేవ్ వెల్లడించారు.

TNN 4 May 2017, 1:19 pm
దేశం కోసం ప్రాణాలర్పించిన అమర జవానుల పిల్లల కోసం ‘పతంజలి ఆవశ్య సైనిక్ స్కూల్’ను ఏర్పాటు చేయనున్నట్లు యోగ గురు, పతంజలి సహవ్యవస్థాపకుడు బాబా రాందేవ్ వెల్లడించారు. ఈ పాఠశాల ద్వారా అమరవీరుల పిల్లలకు ఉచితంగా విద్యను అందిస్తామని చెప్పారు. దేశ రాజధాని ప్రాంతంలోనే ఈ పాఠశాలను నిర్మిస్తామని, ఈ ఏడాదే స్కూల్ ప్రారంభమవుతుందని చెప్పారు. పతంజలి మేనేజింగ్ డైరెక్టర్ బాల్‌కృష్ణతో కలిసి ఢిల్లీలో బాబా రాందేవ్ గురువారం మీడియాతో మాట్లాడారు.
Samayam Telugu patanjali to open school for children of martyred soldiers
అమరవీరుల పిల్లల కోసం ‘పతంజలి స్కూల్’


గతేడాది పతంజలి రికార్డు స్థాయిలో రూ. 10,561 కోట్ల టర్నోవర్ సాధించిందని రాందేవ్ వెల్లడించారు. మరోవైపు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బుధవారం ‘ప‌తంజ‌లి రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌’ను ప్రారంభించారు. ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో ‘పతంజలి యోగ్‌పీఠ్’ పేరిట ఈ ఇన్‌స్టిట్యూట్‌ను నెలకొల్పారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. యోగాకు, ఆయుర్వేద వైద్యం, ఔషధాలకు బాబా రాందేవ్ విశిష్టతను కల్పించారని కొనియాడారు. భారత ఆయుర్వేద ఉత్పతులకు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్‌ పెరుగుంతని చెప్పారు. అలాగే రాబోయే అంత‌ర్జాతీయ యోగా దినోత్సవాన్ని అహ్మాదాబాద్‌లో ఘనంగా నిర్వహించ‌నున్నట్లు చెప్పారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.