యాప్నగరం

పఠాన్‌కోట్ అమర వీరుడికి శౌర్యచక్ర

పఠాన్‌కోట్ అమర వీరుడు లెఫ్టినెంట్ కల్నల్ నిరంజన్‌కు శౌర్యచక్రను ప్రధానం చేయనున్నారు.

TNN 14 Aug 2016, 9:21 pm
పఠాన్‌కోట్ సైనిక స్థావరంపై పాకిస్థాన్ ముష్కరుల దాడిలో మరణించిన భారత అమర వీరుడు లెఫ్టినెంట్ కల్నల్ నిరంజన్‌కు శౌర్యచక్ర మెడల్ బహూకరించి గౌరవించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. సోమవారం నాడు జరిగే స్వాతంత్య్ర దినోత్సవం నాడు దేశ రాజధాని కొత్త ఢిల్లీలో నిరంజన్ కుటుంబ పెద్దకు ఈ మెడల్ ను ప్రధానం చేయనున్నారు. ఎన్.ఎస్.జి. బాంబ్ డిస్ఫోజల్ యూనిట్ కు అధిపతిగా నిరంజన్ వ్యవహరించేవారు. పఠాన్‌కోట్ పై దాడి జరిగిన సంగతి తెలుసుకున్న ఆయన తన బృందంతో అక్కడికి చేరుకున్నారు. అప్పటికే సాయుధ దళాలకు, పాక్ ముష్కరులకు మధ్య పోరు జరుగుతోంది. మన దళాలు కొందరు పాక్ తీవ్రవాదులను హతమార్చాయి. ఆ తీవ్రవాదుల మృతదేహాలను శానిటైజ్ చేస్తుుండగా ఒక మృత తీవ్రవాది శరీరంలోని బాంబు పేలడంతో నిరంజన్ తీవ్రగాయాలపాలయ్యారు. ఆయనను ఆసుపత్రికి తరలిస్తుండగ మార్గ మద్యంలో వీరమరణం పొందారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.