యాప్నగరం

అమిత్ షా సభలో పటీదార్ ల రభస

బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా సూరత్‌ కు సమీపంలోని అబ్రామలో నిర్వహించిన సభ గందరగోళంగా మారింది.

TNN 9 Sep 2016, 12:00 am
బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా సూరత్‌ కు సమీపంలోని అబ్రామలో నిర్వహించిన సభ గందరగోళంగా మారింది. పటీదార్ నాయకులు సభలో ఇష్టానుసారంగా ప్రవర్తించారు. సభ ప్రాంగణంలోని కుర్చీలను ధ్వంసం చేశారు. అమిత్ షా మాట్లాడుతుండగా​ హార్దిక్.. హార్దిక్, జై సర్దార్, జై పటీదార్ అంటూ గట్టిగట్టిగా నినాదాలు చేశారు. ముఖ్యమంత్రి వినయ్ రూపానీ ప్రభుత్వంలోని పటేల్ మంత్రులను సన్మానించేందుకు సూరత్‌ లో బీజేపీ ఆధ్యర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ముందుగా ఒక భారీ ర్యాలీ చేపట్టారు. అందులో బీజేపీ కార్యకర్తలతో పాటు హార్దిక్ పటేల్ మద్దతుదారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. విద్యాఉద్యోగాల్లో తమకు కోటా కల్పించాలని ఎప్పటి నుంచో ఉద్యమం చేపడుతున్న పటీదార్లు అమిత్‌షా సభలో తవ వాయిస్ మరింత ఎక్కువగా వినిపించారు. హార్దిక్ పటేల్ ను వేధించడం తగదంటూ విరుచుకుపడ్డారు. కాగా ఈ సంఘటనతో గుజరాత్ లోని సూరత్, సార్థాన, కపోద్ర, వరచ్చా, పునగాం తదితర ప్రాంతాల్లో ఆందోళన పరిస్థితులు నెలకొన్నాయి. ఆ ప్రాంతాల్లో సిటీ బస్సులు, బీఆర్ టీఎస్ బస్సు సర్వీసులపై ఆందోళనకారులు దాడులకు దిగారు. దీంతో సుమారు 50 మందికి పైగా పటీదార్ లను పోలీసులను అదుపులోకి తీసుకున్నారు.
Samayam Telugu patidars create ruckus amit shah booed at surat event
అమిత్ షా సభలో పటీదార్ ల రభస

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.