యాప్నగరం

Bulldozer action: బుల్డోజర్‌లతో ఇళ్లను కూల్చివేయడం తమాషాగా మారింది: పాట్నా హైకోర్టు

బుల్డోజర్లతో (Bulldozer action) ఇళ్లను కూల్చివేయడం తమాషాగా మారిందని పాట్నా హైకోర్టు వ్యాఖ్యానించింది. ఓ మహిళ ఇంటిని బుల్డోజర్‌తో కూల్చివేసిన కేసు విచారణ జరిగింది. ఈ కేసులో హైకోర్టు తీవ్రంగా స్పందించింది. పోలీసులు ఏం చేస్తారని నిలదీసింది. ల్యాండ్ మాఫియాతో పోలీసులు చేతులు కలుపారా..? అనే అనుమానం కూడా వ్యక్తం చేసింది.

Authored byAndaluri Veni | Samayam Telugu 4 Dec 2022, 4:22 pm

ప్రధానాంశాలు:

  • ఓ మహిళ ఇంటి కూల్చివేత కేసులో విచారణ
  • పోలీసులపై శైలీపై మండిపడ్డ పాట్నా హైకోర్టు
  • పోలీసులు ఎవరికి ప్రాతినిథ్యం వహిస్తున్నారని ప్రశ్నించిన కోర్టు

హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Bulldozer action
బుల్డోజర్లతో (Bulldozer action) ఇళ్లను కూల్చి వేయడంపై పాట్నా హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ విషయంలో బీహార్ పోలీసులను ఆక్షేపించింది. ల్యాండ్ మాఫియా కారణంగా ఓ మహిళ ఇంటిని కూల్చివేసిన కేసులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా బుల్డోజర్ కూల్చివేతలు తమాషాగా మారాయని హైకోర్టు వ్యాఖ్యానించింది. "ఇక్కడ కూడా బుల్డోజర్లు నడపడం ప్రారంభించారా..?.. పోలీసులు ఎవరికి ప్రాతినిథ్యం వహిస్తున్నారు.. రాష్ట్రానికా..? కొంతమంది ప్రైవేట్ ప్రజలకా..? అని ప్రశ్నించింది.
ఇళ్లను కూలుస్తుంటే... ఎలా వదిలేస్తారని నిలదీసింది. ఈ కేసులో స్వయంగా హాజరై సమాధానం ఇవ్వాలని సీనియర్‌ పోలీసు అధికారులను జస్టిస్‌ కుమార్‌ ఆదేశాలు జారీ చేశారు. పిటిషనర్ ఇంటిని తప్పుగా ధ్వంసం చేసినట్టు తేలితే సంబంధిత అధికారి దగ్గర నుంచి రూ.5 లక్షలు పరిహారంగా చెల్లించే విధంగా చూస్తానని కేసును విచారించిన న్యాయమూర్తి హెచ్చరించారు.

నిజానికి ఈ కేసు నవంబర్ 24న విచారణకు వచ్చింది. దీనికి సంబంధించిన వీడియో శనివారం సోషల్ మీడియాలో వైరల్‌ అయింది. ఈ కేసులో పోలీసు నివేదికను అధ్యయనం చేసిన కోర్టు రాష్ట్ర పోలీసులపై ఘాటు వ్యాఖ్యలు చేసింది. కొంతమంది మాఫియాతో అధికారులు చేతులు కలిపినట్టుగా కనిపిస్తుందని జస్టిస్ కుమార్ అనుమానం వ్యక్తం చేశారు. కాగా బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో దాదాపుగా బుల్డోజర్‌లతో కూల్చివేతలు సాగుతున్నాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.