యాప్నగరం

యూపీలో ఘోర రైలు ప్రమాదం.. 63 మంది దుర్మరణం

​ ఉత్తరప్రదేశ్‌లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. కాన్పూర్‌ సమీపంలోని పుఖ్రాయాన్ వద్ద ఇండోర్‌-పట్నా ఎక్స్‌ప్రెస్‌ పట్టాలు తప్పిన ఘటనలో 63 మందికిపైగా మరణించారు.

TNN 20 Nov 2016, 10:14 am
ఉత్తరప్రదేశ్‌లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. కాన్పూర్‌ సమీపంలోని పుఖ్రాయాన్ వద్ద ఇండోర్‌-పట్నా ఎక్స్‌ప్రెస్‌ పట్టాలు తప్పిన ఘటనలో 63 మందికిపైగా మరణించారు. పలువురు గాయపడ్డారు. రైలులోని 14 బోగీలు పట్టాలు తప్పాయి. కాన్పూర్‌కు వంద కిలోమీటర్ల దూరంలో ఆదివారం వేకువజామున 3 గంటల సమయంలో ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న ఉత్తరప్రదేశ్ ఏడీజీ దల్జీత్ సింగ్ చౌధురి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇప్పటికే 63 మృతదేహాలను వెలికితీశామని ఆయన చెప్పారు. సీనియర్ అధికారులు, వైద్య బృందాలను హుటాహుటిన సంఘటన జరిగిన చోటుకు పంపామని రైల్వే వర్గాలు వెల్లడించాయి.
Samayam Telugu patna indore express derail 45 bodies recovered
యూపీలో ఘోర రైలు ప్రమాదం.. 63 మంది దుర్మరణం



పరిస్థితిని దగ్గరుండి సమీక్షించాలని ఆ రాష్ట్ర డీజీపీని ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ ఆదేశించారు. సంఘటనపై రైల్వే శాఖ మంత్రి సురేశ్ ప్రభు విచారణకు ఆదేశించారు. ఈ ప్రమాదంలో ఎస్2 కోచ్ తీవ్రంగా డ్యామేజ్ అయ్యింది. రైలు ప్రమాదం కారణంగా ఆ మార్గంలో వెళ్లే పలు రైళ్ల రాకపోకలు నిలిపివేశారు. సిబ్బంది సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశాలున్నాయి. భారతీయ రైల్వే హెల్ప్‌లైన్ నంబర్లను ఏర్పాటు చేసింది. అవి ఝాన్సీ -05101072, ఒరాయ్-051621072, కాన్పూర్-05121072, పుఖ్రాయాన్-05113-270239

Death toll rises to 45 after Patna-Indore express train derailed near Kanpur: UP ADG (law and order) Daljeet Singh Choudhary to ANI — ANI UP (@ANINewsUP) November 20, 2016

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.