యాప్నగరం

ముంబై తీరంలో కూలిన చాపర్.. ఏడుగురి మృతి?

ఐదుగురు ఓఎన్‌జీసీ ఉద్యోగులు, ఇద్దరు పైలెట్లతో బయల్దేరిన హెలికాప్టర్ ముంబై తీరంలో కూలింది. ఈ ఘటనలో నాలుగు మృతదేహాలను వెలికి తీశారు.

TNN 13 Jan 2018, 3:08 pm
ఐదుగురు ఓఎన్‌జీసీ ఉద్యోగులు, ఇద్దరు పైలెట్లతో వెళ్తున్న హెలికాప్టర్ ముంబై తీరంలో కూలింది. ఈ ఘటనలో నాలుగు మృతదేహాలను వెలికి తీశారు. మిగతా ముగ్గురు కూడా చనిపోయి ఉంటారని భావిస్తున్నారు. పవన్ హన్స్ హెలికాప్టర్ శనివారం ఉదయం 10:14కు జూహూ ఏరో‌డ్రమ్ నుంచి బయల్దేరింది. పావు గంట ప్రయాణించిన తర్వాత ఏటీసీతో సంబంధాలు కోల్పోయింది. ముంబై సముద్రానికి తీరానికి 50 కి.మీ. దూరంలో ఇది కూలిపోయిందని గుర్తించారు.
Samayam Telugu pawan hans helicopter with 7 onboard goes missing off mumbai coast 4 bodies recovered
ముంబై తీరంలో కూలిన చాపర్.. ఏడుగురి మృతి?


చాపర్ ఏటీసీతో సంబంధాలు కోల్పోవడంతో అప్రమత్తమైన కోస్ట్ గార్డ్ డోర్నియర్ ఎయిర్‌క్రాఫ్ట్, నౌకలతో గాలింపు చర్యలు ప్రారంభించింది. హెలికాప్టర్ కూలిపోయిందని భావిస్తోన్న చోట శకలాల లాంటివి లభించాయని రక్షణ శాఖ అధికార ప్రతినిధి తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.