యాప్నగరం

జాత్యంహకార వ్యాఖ్యలపై మండిపడ్డ పవన్

బీజేపీ నేత తరుణ్ విజయ్ వ్యాఖ్యలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మండిపడ్డారు.

TNN 8 Apr 2017, 8:12 am
బీజేపీ నేత తరుణ్ విజయ్ వ్యాఖ్యలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. తరుణ్ విజయ్ వ్యాఖ్యలు జాత్యాంహకరాన్ని తలపిస్తున్నాయని, ఉత్తరాది అహంకారమంతా అతని మాటల్లోనే కనిపిస్తోందన్నారు. ట్విట్టర్లో తన ఖాతాలో అభిప్రాయాలను పోస్టు చేశారు. ఆ పోస్టుల్లో... కొంతమంది నేతలు వివక్షపూరిత మైన మాటలతో గీతలు గీసి మరీ జాతిని విడదీస్తున్నారన్నారు. నల్లగా ఉన్న దక్షిణ భారతీయులు ఇచ్చే రెవెన్యూ మీకు కావాలి కానీ... వాళ్ల మీద మాత్రం మీకు చిన్నచూపు అని విమర్శించారు. ఇలాంటి భావజాలం ఉన్న వ్యక్తులకు స్థానమిచ్చే జాతీయపార్టీలు ఉండడం దౌర్భగ్యమని ఓ ట్వీటులో పేర్కొన్నారు. క్షమాపణ చెప్పినంత మాత్రాన ఈ అవమానాన్ని మరిచిపోలేమని అన్నారు. నల్లగా ఉన్నాయని కోకిలను కూడా నిషేధించమని తరుణ్ నుద్దేశించి ఆయన అన్నారు. జాతీయ త్రివర్ణ పతాకం ఓ దక్షిణాది మహనీయుడి రూపకల్పనేనని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.
Samayam Telugu pawan kalyan reacts on bjp leader tarun vijay comments
జాత్యంహకార వ్యాఖ్యలపై మండిపడ్డ పవన్


పవన్ కళ్యాణ్ ఇంతగా తరుణ్ విజయ్ పై ఎందుకు మండిపడుతున్నారంటే... ఆయన దక్షిణ భారతీయులను చులకన చేసేలా మాట్లాడారు. ఇటీవల నోయిడాలో నైజీరియన్లపై దాడులు జరిగిన సంగతి తెలిసిందే. దీనిపై ఆల్ జజీరా ఛానల్ చర్చ కార్యక్రమం పెట్టింది. అందులో తరుణ్ విజయ్ కూడా పాల్గొన్నారు. ఆ కార్యక్రమంలో మాట్లాడుతూ.. భారతీయులు జాత్యంహకారం ఉన్న వారు కాదని చెప్పారు. నల్లవాడైన కృష్ణుడిని దేవుడిగా పూజిస్తారని, నల్లగా ఉండే దక్షిణ భారతీయులతో కలిసి తాము నివసిస్తున్నామని అన్నారు. ఈ వ్యాఖ్యలు దక్షిణ భారతదేశీయులకు తీవ్ర ఆగ్రహం తెప్పించాయి.
pic.twitter.com/yWVakzUH3F — Pawan Kalyan (@PawanKalyan) April 7, 2017

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.