యాప్నగరం

పళనికి ఓటేసిన మంత్రికి శ్రద్ధాంజలి!

తమిళనాడులో గత రెండు వారాలు రాజకీయ చదరంగం రసవత్తరంగా సాగింది. అసెంబ్లీ బలపరీక్ష తర్వాత కొంత సద్దుమణిగినా ప్రజల ఆగ్రహా జ్వాలలు ఉవ్వెత్తున ఎగసిపడే సూచనలు కనబడుతున్నాయి.

TNN 21 Feb 2017, 3:30 pm
తమిళనాడులో గత రెండు వారాలు రాజకీయ చదరంగం రసవత్తరంగా సాగింది. అసెంబ్లీ బలపరీక్ష తర్వాత కొంత సద్దుమణిగినా ప్రజల ఆగ్రహా జ్వాలలు ఉవ్వెత్తున ఎగసిపడే సూచనలు కనబడుతున్నాయి. పళనిసామికి అనుకూలంగా వ్యవహరించిన ఎమ్మెల్యేలను లక్ష్యంగా చేసుకుని నిరసన కార్యక్రమాలకు తెరతీశారు. వారి నియోజవర్గాల్లో దీనిపై తీవ్ర వ్యతిరేకతలు వ్యక్తం చేస్తున్నారు.
Samayam Telugu people making trubute posters against minister nilofer kapil in tamilnadu
పళనికి ఓటేసిన మంత్రికి శ్రద్ధాంజలి!


దీనిలో భాగంగా అసెంబ్లీలో జరిగిన బలపరీక్షలో పళనిసామికి అనుకూలంగా ఓటు వేసిన వాణియంబాడి ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి నీలోఫర్‌ కపిల్‌‌కు వ్యతిరేకంగా వెల్లూరు జిల్లా వ్యాప్తంగా నిరసనలు ఊపందుకున్నాయి. ఆమెకు శ్రద్ధాంజలి ఘటిస్తూ ముద్రించిన పోస్టర్లు నియోజకవర్గంలో వెలిశాయి. ప్రజల ఓట్లతో ఎమ్మెల్యేగా గెలుపొంది మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తోన్న నీలోఫర్‌ కపిల్‌ ఎవరికి మద్దతు ఇవ్వాలా అన్న దానిపై వారి అభిప్రాయాన్ని తెలుసుకోలేదని అందులో పేర్కొన్నారు.

అందువల్ల ఆమె రాజకీయ జీవితానికి ప్రజలమే చరమగీతం పాడామని రాశారు. ఆమె తిరిగి మా వద్దకు వస్తే చీపుర్లు, చెప్పులతో గుణపాఠం చెబుతామని, ఇట్లు వాణియంబాడి నియోజకవర్గ ప్రజలంటూ వెలిసిన పోస్టర్లు కలకలం సృష్టిస్తున్నాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.