యాప్నగరం

ఇంట్లో చొరబడిన దొంగను పట్టించిన పెంపుడు కుక్క

కోల్‌కతాలో ఓ ఇంట్లోకి చోరీకి యత్నించిన దొంగను పెంపుడు కుక్క పట్టుకుంది. నిందితుడిపై దూకి గట్టిగా కరచి పట్టుకోవడంతో దొంగ పట్టుబడ్డాడు. సీఎం మమతా బెనర్జీ నివాసానికి కూత వేటు దూరంలోని కాళీఘాట్ ఫైర్ స్టేషన్ సమీపంలోని ఓ ఇంట్లోకి వ్యక్తి చొరబడి దొరికినంత దోచుకునేందుకు ప్రయత్నించాడు. ఆ టైంలో పెంపుడు కుక్క నిందితుడిని పట్టించింది.

Authored byAndaluri Veni | Samayam Telugu 2 Jul 2022, 2:08 pm

ప్రధానాంశాలు:

  • ఇంట్లో చోరీకి యత్నించిన దొంగ
  • దొంగపై పడి గట్టిగా పట్టుకున్న కుక్క
  • నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు

హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu ఇంట్లో చొరబడిన దొంగను పట్టించిన పెంపుడు కుక్క
కుక్కకు విశ్వాసం ఎక్కువ... తిండి పెట్టిన తన యజమాని కోసం అవి ఏమైనా చేస్తుంటాయి. ఈ విషయం మరోసారి రుజువైంది. ఇంట్లో పడిన దొంగను పట్టుకోవడంలో ఓ కుక్క కీలక పాత్ర పోషించింది. దక్షిణ కోల్‌కతాలో ఈ ఘటన చోటుచేసుకుంది. సీఎం మమతా బెనర్జీ నివాసానికి కూత వేటు దూరంలోని కాళీఘాట్ ఫైర్ స్టేషన్ సమీపంలోని ఓ ఇంట్లో దొంగ చొరబడి దొరికినంత దోచుకునే ప్రయత్నం చేశాడు.
శుక్రవారం తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో ఓ వ్యక్తి ఇంట్లోకి ప్రవేశించి మెయిన్ డోర్ గొళ్లెం పగలగొట్టి, కొన్ని వస్తువులను దొంగిలించాడు. పనిలో పనిగా రిఫ్రిజిరేటర్‌లోని ఆహారాన్ని కూడా తినడం మొదలుపెట్టాడు. అయితే అలా తినే టైంలో ఆ ఇంటి సభ్యుల్లోని మహిళ దొంగ ఉన్నాడని గమనించి.. గట్టిగా అరిచింది. ఆమె అరుపులు విని మిగతావారు కూడా లేచారు. వెంటనే ఆ కుటుంబానికి చెందిన ప్రసేన్‌జిత్ చక్రవర్తి ఆ దొంగను పట్టుకునేందుకు ప్రయత్నించాడు. అతడిపై కత్తితో దాడి చేశాడు.

దాంతో ఆ ఇంటి కుక్క రాకీ ఊరుకోలేదు. దొంగపైకి దూసుకెళ్లింది. గట్టిగా కరిచి, అతని కాలును పట్టుకుంది. ఆ తర్వాత ఆ ఇంటి సభ్యులు పోలీసులకు ఫోన్ చేసి దొంగను పట్టించారు. పోలీసులు దొంగను అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు బంగారు ఆభరణాలను దొంగలించే ప్రయత్నం చేశాడని పోలీసులు చెప్పారు. దొంగతో పాటు అనుమానితులైన ఇరుగుపొరుగు వారిని కూడా అరెస్టు చేశారు. దొంగ దాడిడి గాయపడిన ప్రసేన్‌జిత్ చక్రవర్తిని ఎస్‌ఎస్‌కేఎం ఆస్పత్రికి తరలించారు. ప్రసేన్‌కు మెడ, భుజానికి 35 కుట్లు పడ్డాయని పోలీసులు తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసి సి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.