యాప్నగరం

Pigeon meat Biryani: రెస్టారెంట్లలో పావురం బిర్యానీలు... సీక్రేట్ ఆపరేషన్‌తో బయటపెట్టిన రిటైర్డ్ ఆర్మీ అధికారి

ముంబైలోని ప్రముఖ హోటళ్లు, రెస్టారెంట్‌లలో పావురం మాంసంతో బిర్యానీలు ( Pigeon meat Biryani) చేస్తున్న వ్యవహారం బయటపడింది. ఓ రిటైర్డ్ జవాన్ నిఘాతో ఇదంతా బయటకొచ్చింది. ఓ వ్యక్తి అపార్ట్‌మెంట్‌పై పావురాలను పెంచి.. వాటిని హోటళ్లు, రెస్టారెంట్‌లకు సప్లై చేసేవాడు. ఈ విషయం తెలుసుకున్న ఓ రిటైర్డ్ జవాన్.. రహస్యంగా ఆధారాలను సేకరించాడు. అనంతరం పోలీసుల దగ్గరకు వెళ్లి ఫిర్యాదు చేశాడు. దాంతో పోలీసులు రంగంలోకి దిగి.. పలువురిపై కేసు పెట్టారు.

Authored byAndaluri Veni | Samayam Telugu 29 Nov 2022, 2:32 pm

ప్రధానాంశాలు:

  • పావురాలను పెంచి హోటళ్లకు, రెస్టారెంట్లకు సప్లై
  • అపార్ట్‌మెంట్‌పై పావురాలను పెంచిన అభిషేక్
  • రిటైర్డ్ మిలట్రీ అధికారి వల్ల బయటపడ్డ వ్యవహారం

హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Pigeon Biryani in Mumbai Hotels
Pigeon meat Biryani: ఏ హోటల్‌, రెస్టారెంట్‌లోనైనా బిర్యానీ కచ్చితంగా ఉంటుంది. చికెన్, మటన్ బిర్యానీ అంటే ఎవరైనా ఎగబడతారు. అయితే ముంబైలోని ప్రముఖ రెస్టారెంట్‌, హోటళ్లలో చికెన్.. మటన్ కాదు.. పావురం బిర్యానీలు పెడుతున్నారు. వచ్చిన కస్టమర్లకు.. పావురం మాంసంతో తయారు చేసిన వేడి వేడి బిర్యానీలు వడ్డిస్తున్నారు. అయితే గుట్టుగా సాగుతున్న ఈ వ్యవహారం ఓ రిటైర్డ్ మిలట్రీ అధికారి వల్ల బయటపడిపోయింది.
రంగంలోకి హరీశ్ గగలాని...
సియోన్ పోలీస్ స్టేషన్ పరిధిలో అభిషేక్ సావంత్ అనే వ్యక్తి పావురాలను పెంచేవాడు. అపార్ట్‌మెంట్‌పైనే పావురాలను పెంచుతూ తన డ్రైవర్ సాయంతో వాటిని ముంబైలోని బార్, రెస్టారెంట్‌లకు విక్రయించేవాడు. అయితే పావురాలకు నీళ్లు పోసేందుకు వెళ్లే వాచ్‌మెన్‌కు ఈ విషయం తెలిసి... అందరికీ చెప్పాడు. కానీ ఎవరూ పట్టించుకోలేదు. అందరూ మనకెందుకులే అనుకున్నారు. కానీ రిటైర్డ్ జవాన్ హరీశ్ గగలాని (71) మాత్రం అలా అనుకోలేదు.

రహస్యంగా నిఘా..
ఆ వ్యవహారాన్ని బయట పెట్టేందుకు నిఘా వేశాడు. స్వయంగా అన్ని ఆధారాలు సేకరించాడు. పావురాలను పెంచుతున్న ప్రాంతానికి వెళ్లి గుట్టుగా ఫోటోలు తీశాడు. ఆధారాలు సేకరించాక.. పోలీసులకు దగ్గరకు వెళ్లాడు. జరిగింది చెప్పి... ఆధారాలన్ని ఇచ్చి ఫిర్యాదు చేశాడు. అభిషేక్ సావంత్ పావురాలను పెంచి బార్లు, రెస్టారెంట్లను అందిస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నాడు.

ఈ మేరకు పోలీసులు రంగంలోకి దిగి.. అభిషేక్ సావంత్‌తో పాటు అపార్ట్‌మెంట్ ప్రెసిడెంట్, సెక్రటరీ, సొసైటీలో కొంతమందిపై కేసులు పెట్టారు. ఈ మేరకు రంగంలోకి దిగి.. దర్యాప్తు చేస్తున్నారు. దీంతో సంచలన విషయాలు బయటకొచ్చాయి. అభిషేక్‌ మార్చి 2022 నుంచి మే 2022 మధ్య కాలంలో పెద్ద సంఖ్యలో పావురాలను పెంచాడని, వాటిని దగ్గర్లోని హోటళ్లకు విక్రయించాడని తెలిసింది.

Read Also: National News and Telugu News

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.