యాప్నగరం

నాకు ప్రాణభయం ఉంది, కాపాడండి.. ముందే వేడుకున్న టైలర్

Udaipur Tailor Murder Case: రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో టైలర్ దారుణ హత్య దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. తనకు ప్రాణభయం ఉందని ముందే గ్రహించిన టైలర్ కన్హయ్య లాల్.. 2 వారాల కిందటే స్థానిక అధికారులను కలిసి తనకు భద్రత కల్పించాల్సిందిగా కోరాడు. కొంత మంది వ్యక్తులు తనను వెంబడిస్తున్నారని, చంపేస్తామని బెదిరిస్తున్నారని ఫిర్యాదు చేశాడు. నుపుర్ శర్మ ట్వీట్ రీట్వీట్ చేసిన ఘటనలో టైలర్ కన్హయ్య లాల్‌పై కేసు నమోదైంది.

Authored byశ్రీనివాస్ గంగం | Samayam Telugu 29 Jun 2022, 7:46 pm
రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో టైలర్ దారుణ హత్యోదంతం దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన కీలక వివరాలు వెలుగులోకి వస్తున్నాయి. తనకు ప్రాణభయం ఉందని ముందే గ్రహించిన టైలర్ కన్హయ్య లాల్.. రెండు వారాల కిందటే స్థానిక అధికారులను కలిసి తనకు భద్రత కల్పించాల్సిందిగా కోరారు. అయితే, అధికారులు దాన్ని సీరియస్‌గా పరిగణించకపోవడం వల్లే ఈ దారుణం జరిగిందని ప్రస్తుతం విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పొరుగున నివాసం ఉండే నజీమ్ మరి కొందరు తనను తరచూ వెంబడిస్తున్నారని.. చంపేస్తామని బెదిరిస్తున్నారని కన్హయ్య లాల్ తన ఫిర్యాదు లేఖలో పేర్కొన్నారు.
Samayam Telugu ఉదయ్‌పుర్ టైలర్
Udaipur Tailor murder Case


ఓ మతాన్ని ఉద్దేశించి బీజేపీ మాజీ నాయకురాలు నుపుర్ శర్మ చేసిన ట్వీట్ అలజడి రేపిన సంగతి తెలిసిందే. నుపుర్ శర్మ ట్వీట్‌ను కన్హయ్య లాల్ రీట్వీట్ చేశాడు. ఈ ఘటనపై స్థానికంగా ఓ వర్గం ఫిర్యాదు చేయడంతో పోలీసులు కన్హయ్య లాల్‌పై కేసు నమోదు చేసి, అదుపులోకి తీసుకొని విచారించారు.

మతాన్ని అవమానించాడనే ఆరోపణలతో కన్హయ్య లాల్‌ను ఇద్దరు వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. పట్టపగలే అతి కిరాతకంగా నరికి చంపారు. అంతేకాకుండా.. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్‌ చేసి, ప్రధానిని కూడా చంపేస్తామంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. దీంతో ఈ ఘటన దేశవ్యాప్తంగా అలజడి రేపుతోంది. హత్యను ఖండిస్తూ రాజస్థాన్ సహా పలు ప్రాంతాల్లో జరిగిన ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. ఉదయ్‌పూర్‌లో 144 సెక్షన్ విధించి భద్రతా దళాలను పెద్ద సంఖ్యలో మోహరించారు.

పాకిస్థాన్‌ కేంద్రంగా పని చేస్తోన్న ఓ ఉగ్రవాద సంస్థకు చెందిన ‘స్లీపర్‌ సెల్‌’ ఈ హత్యకు పాల్పడిందని నిఘా వర్గాల దర్యాప్తులో తేలినట్లు సమాచారం. కేంద్ర హోం శాఖ ఈ కేసు దర్యాప్తు బాధ్యతలను జాతీయ దర్యాప్తు సంస్థ (NIA)కు అప్పగించింది. అటు రాజస్థాన్ ప్రభుత్వం కూడా ఈ కేసు విచారణకు ప్రత్యేక విచారణ బృందాన్ని (SIT) ఏర్పాటు చేసింది. ఈ కేసులో ఇప్పటివరకు ముగ్గురు అనుమానితులను అరెస్టు చేశారు. మరో 10 మందిని విచారిస్తున్నారు.

Also Read:

స్విమ్మింగ్ పోటీల్లో షాకింగ్ ఘటన.. స్పృహ కోల్పోయి కొలనులో మునిగిన స్విమ్మర్
రచయిత గురించి
శ్రీనివాస్ గంగం
శ్రీనివాస్ రెడ్డి గంగం సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ అంశాలపై వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. EJS నుంచి శిక్షణ పొందిన శ్రీనివాస్‌కు జర్నలిజంలో 12 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. JNTU నుంచి BTech చేశారు. గతంలో ప్రముఖ పత్రికల్లో వార్తలు, విద్యా సంబంధిత అంశాలు అందించారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.