యాప్నగరం

‘క్రిస్టమస్ బహుమతుల’ పథకాలు ప్రారంభం

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ క్రిస్టమస్ బహుమతులు ప్రకటించారు.

Samayam Telugu 25 Dec 2016, 12:28 pm
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ క్రిస్టమస్ బహుమతుల పథకాన్ని ప్రకటించారు. నగదురహిత చెల్లింపులు ప్రొత్సహించేందుకు ఆయన ‘లక్కీ గ్రహక్ యోజన’, ‘డిజి ధన్ వ్యాపార్ యోజన’ అనే రెండు పథకాలు ఆదివారం ప్రారంభించారు. మన్ కి బాత్ లో పాల్గొన్న ఆయన పలు అంశాలపై తన మనసులో మాటలను వెలిబుచ్చారు.
Samayam Telugu pm modi announces christmas gifts on mann ki baat
‘క్రిస్టమస్ బహుమతుల’ పథకాలు ప్రారంభం


నగదు రహిత చెల్లింపులు చేపట్టే వ్యాపారులకు పన్ను చెల్లింపులో భారీ నజరాలు ఉంటాయని ఆయన చెప్పారు. పన్నులో రాయితీలు డిజిధన్ వ్యాపార్ యోజన పథకం కింద కల్పిస్తారు. ఈ పథకం వ్యాపారులు డిజిటల్ చెల్లింపులవైపు మళ్లేందుకు తోడ్పడుతుందని ఆయన అన్నారు.

అటు సామాన్య ప్రజలు రూ.50 నుంచి 3000లోపు నగదు రహిత చెల్లింపులు చేసేవారిలో 15వేల మందిని లక్కీడ్రా ద్వారా ఎంపిక చేసి వారికి వంద రోజుల తర్వాత అంటే ఏఫ్రిల్ 14 అంబేద్కర్ జయంతి నాడు ఒక్కొక్కరికి రూ.1000 నగదు పారితోషికం అందిస్తారు. లక్కీ గ్రహక్ యోజన వంద రోజులు స్కీమ్. అల్ఫాదాయ వర్గాలకు ఈపథకం ఎంతో ఉపయోగకరమని మోదీ తెలిపారు.

పెద్దనోట్ల రద్దు తర్వాత క్యాష్ లెస్ చెల్లింపులకు 300శాతం పెరిగాయని మోదీ చెప్పారు. డిజిటల్ ఉద్యమంలో యువత భాగస్వాములు కావాలని ఇది వారికి బంగారు అవకాశమని అన్నారు.

అటు జూనియర్ హాకీ టీమ్ ప్రపంచకప్ సాధించడంపై మోదీ హర్షం వ్యక్తం చేశారు. టీమ్ కు శుభాకాంక్షలు చెప్పారు. క్రికెట్ టీం కూడా ఎంతో ఉత్సాహంగా ఆడుతుందని, దేశాన్ని గర్వపడేలా చేస్తుందని ఆయన మెచ్చుకున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.