యాప్నగరం

దోపిడి సొమ్ము బయటికి వస్తోంది - మోడీ

జపాన్ పర్యటనలో ఉన్న ప్రధాని మోడీ ఈ రోజు కోబెనగరంలో ప్రవాస భారతీయుల సదస్సులో పాల్గొన్నారు.

TNN 12 Nov 2016, 4:40 pm
పెద్దనోట్ల రద్దు నిర్ణయంతో వేల కోట్ల నల్లధనం బయటకు వస్తోందని ప్రధాని మోడీ అన్నారు. నలధనాన్ని బ్యాంకుల్లో జమా చేసేందుకు నల్లకుబేరులు క్యూకడుతున్నారని వెల్లడించారు. గత మూడు రోజుల్లో రూ.45 వేల కోట్లు బ్యాంకుల్లో డిపాజిట్ అయ్యాయని వెల్లడించారు. జపాన్ పర్యటనలో ఉన్న ప్రధాని మోడీ ఈ రోజు కోబెనగరంలో ప్రవాస భారతీయుల సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నల్లకుబేరుల భరతం పట్టేందుకే ఇలాంటి కఠిన చర్యలు తీసుకోవాల్సి వచ్చిందన్నారు. సామన్య ప్రజలు ఇబ్బందుకులు పడుతున్న మాట వాస్తవమే అయినప్పటికీ ఇవి తాత్కాలిక ఇబ్బందులేనని ప్రధాని మోడీ వ్యాఖ్యనించారు.
Samayam Telugu pm modi attend the non resident indian summit in japan
దోపిడి సొమ్ము బయటికి వస్తోంది - మోడీ


నోట్ల రద్దు నిర్ణయం నల్లకుబేరులను టార్గెట్ చేసుకొని తీసుకున్నామని మోడీ వివరించారు. తాజా నిర్ణయంతో నల్లకుబేరులకు పట్టపగలే చుక్కలు కనిపిస్తున్నాయన్నారు. తాను గతంలో ఒక అవకాశం ఇచ్చామని.. 50 రోజుల గడవు విధించి ఆదాయానికి సంబంధించిన లెక్కలు చూపించాలని కోరామన్నారు. అయితే కొంత మంది మాత్రమే బయటికి వచ్చారన్నారని తెలిపారు. అయితే అవి చిన్న చేపలు మాత్రమేనని..అవినీతి ప్రపంచంలో దాక్కున్న ఎన్నో తిమింగలాలు ఉన్నాయని.. వాటిని బయటికి తీసుకునేందుకే ఈ కఠిన నిర్ణయం తీసుకున్నామన్నారు. తాజా నిర్ణయంతో భారత దేశంలో బ్లాక్ మనీ రహిత దేశంగా మారుతుందని ప్రధాని మోడీ అన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.