యాప్నగరం

ఇకపై రైతులకు సమస్యలే ఉండవు: మోదీ

వరితో పాటు మరో 13 ఖరీఫ్ పంటలకు కనీస మద్దతు ధరను పెంచేందుకు నిర్ణయం తీసుకోవడంతో ఇకపై రైతులకు సమస్యలే ఉండబోవని ప్రధానమంత్రి మోదీ అన్నారు.

Samayam Telugu 11 Jul 2018, 6:11 pm
వరితో పాటు మరో 13 ఖరీఫ్ పంటలకు కనీస మద్దతు ధరను పెంచేందుకు నిర్ణయం తీసుకోవడంతో ఇకపై రైతులకు సమస్యలే ఉండబోవని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. పంజాబ్ ముక్తసర్ జిల్లాలోని మాలోత్‌లో బుధవారం (జులై 11) నిర్వహించిన 'కిసాన్‌ కల్యాణ్‌ ర్యాలీ'లో మోదీ పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులందరికీ శిరసు వంచి నమస్కరిస్తున్నాను.. తమ ప్రభుత్వం రైతులను అన్ని విధాలుగా అండగా నిలుస్తోందని.. రైతులందరూ సుఖంగా నిద్ర పోతున్నారని మోదీ అన్నారు. కానీ కాంగ్రెస్‌తో పాటు ఆ పార్టీ మిత్రపక్షాలకు మాత్రం నిద్ర పట్టడం లేదని విమర్శించారు.
Samayam Telugu మోదీ


70 ఏళ్లుగా రైతుల కోసం కాంగ్రెస్‌ పార్టీ చేసిందేమీ లేదని మోదీ అన్నారు. కాంగ్రెస్ హయాంలో రైతులు తీవ్ర కష్టాలు పడ్డారని ఆరోపించారు. కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వాల విధానాలతో దశాబ్దాలుగా రైతులు నిరాశతో కూడిన జీవితాలను గడపారన్నారు. అమలుకు సాధ్యం కానీ వాగ్దానాలు చేసి రైతులను మోసం చేసిందని కాంగ్రెస్ పార్టీపై ఆయన ధ్వజమెత్తారు. రైతులను కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే కాంగ్రెస్ వాడుకుందని విమర్శించారు.

2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడమే ధ్యేయంగా బీజేపీ ప్రభుత్వం పెట్టుకుందని మోదీ వెల్లడించారు. మూడేళ్లలో వ్యవసాయ ఉత్పత్తులను రైతులు రెట్టింపు చేశారని తెలిపారు. వరితో పాటు మరో 13 ఖరీఫ్‌ పంటలకు కనీస మద్దతు ధరను పెంచడానికి నిర్ణయం తీసుకోవడంతో రైతులకు ఇకపై సమస్యలు ఉండబోవని మోదీ తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.