యాప్నగరం

ఆమె గ్రౌండ్ రిపోర్ట్ నా మనసులో బలమైన ముద్ర వేసింది: మోదీ

PM Modi: బెంగాల్‌కు చెందిన ఓ మహిళా జర్నలిస్టుపై ప్రధాని మోదీ ప్రశంసలు కురిపించారు. అంఫన్ తుఫాన్ బీభత్సం వేళ ఆమె తెగువను కొనియాడారు. ఆమె గ్రౌండ్ రిపోర్టును చూసి చలించిపోయి తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించినట్లు తెలిపారు.

Samayam Telugu 28 May 2020, 4:52 pm
శ్చిమ బెంగాల్‌కు చెందిన ఓ మహిళా జర్నలిస్టు చేసిన సాహసంపై ప్రధాని మోదీ ప్రశంసలు కురిపించారు. ఆమెకు ఫోన్ చేసి అభినందించారు. సూపర్ సైక్లోన్ అంఫన్ ఇటీవల పశ్చిమ బెంగాల్‌ను అతలాకుతలం చేసిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో కోల్‌కతాకు చెందిన టీవీ జర్నలిస్ట్ సుచంద్రిమ పాల్ అత్యంత సాహసోపేతంగా తుఫాన్ కవరేజ్ వార్తలను అందించారు. తుఫాన్ కారణంగా కురిసిన భారీ వర్షాలకు వచ్చిన వరదల్లో.. నడుము లోతు నీటిలో దిగి సుచంద్రిమ గ్రౌండ్ రిపోర్ట్ ఇచ్చారు. అంఫన్ తుఫాన్ బీభత్సం వేళ ఆమె ప్రదర్శించిన తెగువను కొనియాడారు.
Samayam Telugu సుచంద్రిమ గ్రౌండ్ రిపోర్ట్
West Bengal Woman Reporter


సుచంద్రిమ పాల్ రిపోర్ట్ నా మనసులో బలమైన ముద్ర వేసింది. కోల్‌కతా టీవీలో ఆమె గ్రౌండ్ రిపోర్టు చూసిన తర్వాతే తుఫాన్ బాధిత ప్రాంతాల్లో పర్యటనకు బయల్దేరి వెళ్లా..
ప్రధాని మోదీ

కోల్‌కతా టీవీలో సుచంద్రిమ ఇచ్చిన గ్రౌండ్ రిపోర్ట్ చూసి తాను చలించిపోయానని.. వెంటనే బాధిత ప్రాంతాలను సందర్శించానని ప్రధాని మోదీ వెల్లడించారు. తుఫాన్‌తో కకావికలమైన బెంగాల్‌కు తక్షణ సాయం కింద రూ. 1000 కోట్లు ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు. సుచంద్రిమ రిపోర్ట్ తన మనసులో బలమైన ముద్ర వేయడమే దీనికంతటికీ కారణమని ప్రధాని పేర్కొన్నారు.

Also Read: వలస కూలీలకు విమాన టిక్కెట్లు బుక్ చేసిన రైతు.. అన్నదాతా హ్యాట్సాఫ్

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.