యాప్నగరం

బస్సు ప్రమాదం: మృతుల కుటుంబాలకు మోదీ, రాహుల్ సానుభూతి..

మహారాష్ట్ర ఘోర బస్సు ప్రమాద ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ, తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

Samayam Telugu 28 Jul 2018, 5:14 pm
శనివారం (జులై 28) జరిగిన మహారాష్ట్ర ఘోర బస్సు ప్రమాద ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతులకు సంతాపం ప్రకటిస్తూ.. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. బస్సు ప్రమాదంలో పలువురు మృతి చెందిన సంఘటన తనను తీవ్రంగా కలచివేసిందని మోదీ అన్నారు. ఈ మేరకు ప్రధాని కార్యాలయం ట్వీట్ చేసింది. ఈ ప్రమాదంపై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకోవాలంటూ ట్విట్టర్ వేదికగా పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
Samayam Telugu modi-rahul




మహారాష్ట్రలో ఘోర విషాదం చోటుచేసుకుంది. సతారా జిల్లాలోని అంబేనలి ఘాట్‌లో ఓ ప్రైవేటు బస్సు లోయలో పడి 33 మంది చనిపోయారు. వారాంతం కావడంతో కొంకణ్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయానికి చెందిన 33 మంది మహాబలేశ్వరం విహార యాత్రకు బయల్దేరారు. ఉదయం 11.30 గంటల సమయంలో బస్సు పొలాద్‌పూర్ చేరగానే అదుపుతప్పి లోయలో పడిపోయింది. ప్రమాదం సమయంలో బస్సులో డ్రైవర్, క్లీనర్‌తో పాటు 35 మంది ఉన్నారు. దాదాపు 200 అడుగుల లోతైన లోయలోకి పడటంతో బస్సు నుజ్జునుజ్జయ్యింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.