యాప్నగరం

Kolkata Port Trust పేరు మార్చిన మోదీ.. కార్యక్రమానికి డుమ్మా కొట్టిన దీదీ

PM Modi : కోల్‌కతా పోర్ట్ ట్రస్ట్ పేరును శ్యామ ప్రసాద్ ముఖర్జీ పోర్ట్‌గా మారుస్తున్నట్టు ప్రధాని మోదీ ప్రకటించారు. పోర్టు ట్రస్ట్ 150వ వార్షికోత్సవ వేడుకలకు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ గైర్హాజరయ్యారు.

Samayam Telugu 12 Jan 2020, 1:25 pm
కోల్‌కతా పోర్ట్ ట్రస్ట్ 150వ సంవత్సరాల వేడుకల్లో పాల్గొన్న ప్రధాని మోదీ.. ఈ సందర్భంగా దాని పేరు మార్చారు. భారతీయ జన సంఘ్ వ్యవస్థాపకుడు శ్యామ ప్రసాద్ ముఖర్జీ పేరును దానికి పెట్టారు. నేతాజీ ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన కార్యక్రమంలో మోదీ మాట్లాడుతూ.. ఈ పోర్టును ఇక నుంచి శ్యామ ప్రసాద్ ముఖర్జీ పోర్ట్ పేరిట పిలుద్దామన్నారు. అభివృద్ధి కోసం.. ఒకే దేశం, ఒకే రాజ్యాంగం అనే ఆలోచన కోసం శ్యామ ప్రసాద్ ముఖర్జీ ముందుండి పోరాడారన్నారు.
Samayam Telugu pm modi renames kolkata port trust mamata banerjee skips celebrations
Kolkata Port Trust పేరు మార్చిన మోదీ.. కార్యక్రమానికి డుమ్మా కొట్టిన దీదీ


కాగా, ఈ వేడుకలకు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ హాజరు కాలేదు. తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ, ప్రధాని మోదీ మధ్య రాజకీయంగా విబేధాలు ఉన్నాయని వార్తలు వెలువడుతున్న తరుణంలో ఆమె ఈ వేడుకలకు హాజరు కాకపోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఆహ్వాన పత్రికలో ప్రధాని మోదీ, గవర్నర్ జగదీప్ ధనకర్ పేరుతోపాటు దీదీ పేరు కూడా చేర్చారు.

వచ్చే ఏడాదిలో బెంగాల్ ఎన్నికలు జరగబోతున్నాయి. 2019 లోక్ సభ ఎన్నికల్లో బెంగాల్లో ఊహించని రీతిలో 18 స్థానాలను గెలుపొందిన బీజేపీ.. అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో ఉంది. మరోవైపు మమతా బెనర్జీ కూడా తిరిగి అధికారంలోకి రావడం కోసం అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నారు. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా కోల్‌కతాలో నిర్వహించిన ఆందోళనలకు మమతా నేతృత్వం వహించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.