యాప్నగరం

మోడీ సినిమాల్లో 'గబ్బర్'లాంటి టైపు: మమతా బెనర్జీ

కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, వెస్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ నేతృత్వంలోని 8 ప్రతిపక్షపార్టీలు...

TNN 28 Dec 2016, 5:22 am
కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, వెస్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ నేతృత్వంలోని 8 ప్రతిపక్షపార్టీలు ప్రధాని నరేంద్ర మోడీ రాజీనామాకు డిమాండ్ చేశాయి. నోట్ల రద్దు అనంతరం 50 రోజుల్లో దేశంలో మళ్లీ సాధారణ పరిస్థితి వస్తుంది అని మాట ఇచ్చిన మోడీ, ఆ మాట నిలబెట్టుకోలేకపోయారని ఈ ప్రతిపక్ష కూటమి ఆగ్రహం వ్యక్తంచేసింది. ప్రధాని మోడీని సినిమాల్లో గబ్బర్ లాంటి వాడు అని అభివర్ణించిన మమతా బెనర్జీ... ప్రతిపక్షాలకి సమస్యలు సృష్టించడమే ప్రధాని పనిగా పెట్టుకున్నారు అని అన్నారు. మేము ఏమైనా అంటే, 'గబ్బర్ ఆ జాయేగా' అని బెదిరింపులకి పాల్పడుతున్నారు అని మమతా మండిపడ్డారు.
Samayam Telugu pm modi should quit mamata banerjee rahul gandhi
మోడీ సినిమాల్లో 'గబ్బర్'లాంటి టైపు: మమతా బెనర్జీ


మొదట్లో ప్రధానిపై రాహుల్ అంతస్థాయిలో విరుచుకుపడనప్పటికీ... నోట్ల రద్దు తర్వాత జనం ఎదుర్కొంటున్న సమస్యల్ని ప్రస్తావిస్తూ మమతా బెనర్జీ కేంద్రంపై దూకుడు పెంచడం కాస్తా రాహుల్‌‌ని సైతం మోడీ రాజీనామాకు డిమాండ్ చేసేలా చేసింది. దీంతో మోడీ తనకు తానుగా రాజీనామా చేయకుంటే, మేము అతడిపై ఒత్తడి తీసుకువస్తాం అని అన్నారు రాహుల్.

50 రోజుల్లో సాధారణ పరిస్థితి వస్తుంది అని నోట్ల రద్దు అనంతరం మోడీ ప్రకటించారు. కానీ ఇప్పటికే 47 రోజులు గడిచిపోయినా ఏమీ ఫలితం లేకపోయింది. ఇక మిగిలివున్న ఈ 3 రోజుల్లోనే ఫలితాన్ని రాబట్టడానికి మోడీ ఏం మెజీషియన్ కాదన్న మమతా బెనర్జీ... నోట్ల రద్దుని ఓ మెగాస్కామ్‌గా అభివర్ణించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.