యాప్నగరం

జాతిని ఉద్దేశించి.. రేపు ప్రధాని మోదీ ప్రసంగం.. లాక్‌డౌన్ ఆంక్షలు సడలింపు?

India Lockdown | లాక్‌డౌన్ పొడిగిస్తారని వార్తలు వెలువడుతున్న తరుణంలో ప్రధాని నరేంద్ర మోదీ జాతిని ఉద్దేశించి మాట్లాడనున్నారు. ఆంక్షలతో లాక్‌డౌన్‌ను కొద్దిగా సడలించే అవకాశం ఉంది.

Samayam Telugu 13 Apr 2020, 2:51 pm
ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. మంగళవారం ఉదయం 10 గంటలకు ఆయన ప్రజలను ఉద్దేశించి మాట్లాడతారు. మంగళవారంతో లాక్‌డౌన్ ముగియనున్న నేపథ్యంలో మోదీ ఏం మాట్లాడతారనేది ఆసక్తికరంగా మారింది. లాక్‌డౌన్ పొడిగించే అవకాశం ఉందని ఇప్పటికే కేంద్రం సంకేతాలు ఇచ్చింది. ఇటీవలే ప్రధాని మోదీ 13 రాష్ట్రాల సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడిన సంగతి తెలిసిందే. చాలా మంది ముఖ్యమంత్రులు లాక్‌డౌన్ పొడిగించాలనే ప్రతిపాదనకు మద్దతు తెలిపాయి.
Samayam Telugu pm modi address to the nation


Read Also: ఏపీ: రెడ్, ఆరెంజ్ జోన్లు అంటే ఏంటి.. నిబంధనలు ఇలా...

లాక్‌డౌన్‌ను ఏప్రిల్ 30 వరకు పొడిగిస్తారని భావిస్తున్నారు. కాగా దేశాన్ని గ్రీన్, రెడ్, ఆరంజ్ జోన్లుగా విభజించే అవకాశం ఉందని కూడా తెలుస్తోంది, గ్రీన, ఆరంజ్ జోన్లలో ఆర్థిక కార్యకలాపాలు కొనసాగేలా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. జీవితంతోపాటు ఆర్థిక వ్యవస్థ కూడా ముఖ్యమే అని అర్థం వచ్చేలా మోదీ చేసిన వ్యాఖ్యలు దీనికి బలం చేకూరుస్తున్నాయి.

Also Read: ఏపీ కరోనా అలర్ట్: మరో 12 పాజిటివ్.. ఆ ఒక్క జిల్లాలో 90 కేసులు

దేశంలో పంట కోతల సీజన్ నడుస్తోన్న నేపథ్యంలో.. వ్యవసాయ పనులకు లాక్‌డౌన్‌తో ఇబ్బంది లేకుండా చూసేలా ప్రధాని ఆదేశాలు జారీ చేసే అవకాశం ఉంది. కొన్ని పరిశ్రమలను కూడా 25 శాతం సామర్థ్యం నడిపేందుకు అనుమతి ఇస్తారని భావిస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.