యాప్నగరం

ఇద్దరు రావణులను దహనం చేయనున్న మోదీ

ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ దసరా ఉత్సవాల్లో భాగంగా రావణ దహనాన్ని రెండుచోట్ల చేయనున్నారు.

TNN 5 Oct 2016, 1:02 pm
ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ దసరా ఉత్సవాల్లో భాగంగా రావణ దహనాన్ని రెండుచోట్ల చేయనున్నారు. అక్టోబర్ 11న జరుగనున్న దసరా రోజున మోదీ ఢిల్లీలోని రామ్ లీలా మైదాన్ తో పాటు ఉత్తర్ ప్రదేశ్ లోని లక్నోలో ఉన్న అయేషాబాగ్ ​ రామ్ లీలా మైదానంలోని రావణ దహన కార్యక్రమంలో పాల్గొంటారని ప్రధానమంత్రి కార్యాలయం తెలిపింది.
Samayam Telugu pm modi to slay ravana at aishbagh ground in up
ఇద్దరు రావణులను దహనం చేయనున్న మోదీ


అక్టోబర్ 11న అయేషాబాగ్ లో ఏర్పాటు చేయనున్న కార్యక్రమంలో మోదీ పాల్గొననున్నట్లు లక్నో మేయర్ దినేష్ దృవీకరించారు. 16వ శతాబ్దంలో ఏర్పాటైన ఈ మైదానంలో ప్రతియేటా దసరా పండుగ నాడు రావణ దహనాన్ని కొనసాగిస్తున్నట్లు ఆయన తెలిపారు.
ఆరోజు రావణ దహన కార్యక్రమం ముగిశాక..అక్కడే మోదీ ప్రజలను ఉద్దేశించి మాట్లాడే అవకాశం ఉంది. పీవోకేలో ఇండియన్ ఆర్మీ దాడి తర్వాత మోదీ అధికారికంగా ఎక్కడ మాట్లాడలేదు. అయితే 2017లో ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో.. తొలిసారి అయేషా బాగ్ లో పీవోకే ఘటనపై మాట్లాడతారని, అది పార్టీకి కూడా ఎంతో లాభిస్తుందని బీజేపీ నేతలు అంటున్నారు.

ఉత్తర్ ప్రదేశ్ లో చాలాకాలంగా అధికారానికి దూరమైన బీజేపీ...2014లో కేంద్రంలో అధికారం చేపట్టడంతో...మిగతా రాష్ట్రాలకు విస్తరించడం...యూపీలో కూడా పట్టు నిలుపుకునేందుకు శతవిధాల ప్రయత్నిస్తోంది. అధికార ఎస్పీ, ప్రతిపక్ష బీఎస్పీలను ఎదుర్కొనేందుకు గట్టి ఫేస్ ఇక్కడ లేకపోవడంతో మోదీపై ఆధారపడ్డారు.
అక్టోబర్ 11న దసరా వేడుకల్లో పాల్గొనేందుకు వస్తున్న మోదీ బహిరంగసభలో కూడా ప్రసంగిస్తే బీజేపీ శ్రేణులు మళ్లీ పుంజుకునే అవకాశం లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.