యాప్నగరం

Flood Relief Kerala: కేరళలో ప్రధాని ఏరియల్ సర్వే.. తక్షణ సాయం ప్రకటన

గత పది రోజులుగా భారీ వర్షాల ధాటికి చిగురుటాకులా వణికిపోతున్న కేరళలో ప్రధాని మోదీ శనివారం ఏరియల్ సర్వే నిర్వహించారు.

Samayam Telugu 18 Aug 2018, 12:45 pm
గత పది రోజులుగా భారీ వర్షాల ధాటికి చిగురుటాకులా వణికిపోతున్న కేరళలో ప్రధాని మోదీ శనివారం పర్యటించారు. పూర్తిగా వరద నీటిలో చిక్కుకున్న దక్షిణాది రాష్ట్రంలో ఆయన ఏరియల్ సర్వే నిర్వహించారు. ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి తిరువనంతపురం చేరుకున్న ప్రధాని.. కేరళ సీఎం, అధికారులతో అత్యున్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించిన అనంతరం ఏరియల్ సర్వేలో పాల్గొన్నారు. ప్రధాని మోదీతోపాటు కేరళ సీఎం పినరయి విజయన్, గవర్నర్ సదాశివం, పర్యాటక మంత్రి కేజే ఆల్ఫోన్స్‌ ఏరియల్ సర్వేలో ప్రధానితోపాటు పాల్గొన్నారు.
Samayam Telugu modi


కేరళ పరిస్థితి చూసి చలించిపోయిన ప్రధాని తక్షణ సాయంగా రూ.500 కోట్లు ప్రకటించారు. వరదలు, వర్షాల వల్ల మరణించిన వారి కుటుంబాలకు రూ.2 లక్షల పరిహారం చెల్లిస్తామని ప్రధాన మోదీ తెలిపారు. తీవ్రంగా గాయపడిన వారికి పీఎం రిలీఫ్ ఫండ్ నుంచి రూ.50 వేలు ఆర్థిక సాయం చేస్తామని మోదీ ప్రకటించారు. ఇప్పటికే హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కేరళలో ఎరియల్ సర్వే నిర్వహించిన సంగతి తెలిసిందే. ఆయన రూ.100 కోట్ల మేర తక్షణ ఆర్థిక సాయం ప్రకటించారు.

వరద బీభత్సంతో రాష్ట్రానికి సుమారు రూ.20 వేల కోట్ల నష్టం వాటిల్లిందని, తక్షణమే రూ.2 వేల కోట్లు విడుదల చేయాలని కేరళ సర్కారు ప్రధాని మోదీని కోరింది. దీంతో అక్కడి పరిస్థితిని స్వయంగా తెలుసుకోవడం కోసం ప్రధాని కేరళ వెళ్లారు.
కేరళను ఆదుకోవడానికి తోటి రాష్ట్రాలు ముందుకొస్తున్నాయి. తెలంగాణ సర్కారు రూ.25 కోట్ల విరాళం ప్రకటించగా.. ఆంధ్ర ప్రదేశ్ రూ.10 కోట్లు సాయంగా ప్రకటించింది. నీటిని శుద్ది చేసేందుకు రూ.2.5 కోట్ల విలువైన ఆర్వో మెషీన్లను కేసీఆర్ సర్కారు కేరళకు పంపుతోంది. చిన్న పిల్లల కోసం రూ.55 లక్షల విలువైన ‘బాలమృతం’ను కూడా బేగంపేట నుంచి కేరళ పంపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.