యాప్నగరం

మహాత్మా గాంధీ శైలిలో నరేంద్ర మోదీ!

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రెండు రోజుల పర్యటన నిమిత్తం గురువారం గుజరాత్‌కు వెళ్లారు. అహ్మదాబాద్‌ చేరుకున్న..

TNN 29 Jun 2017, 8:37 pm
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రెండు రోజుల పర్యటన నిమిత్తం గురువారం గుజరాత్‌కు వెళ్లారు. అహ్మదాబాద్‌ చేరుకున్న ప్రధాని మోదీ.. అక్కడి సబర్మతీ ఆశ్రమాన్ని సందర్శించారు. ఆశ్రమం శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొన్న ప్రధాని.. అక్కడి ఆవరణలో మొక్క నాటారు. ఆ తర్వాత మహాత్మా గాంధీ ఒకప్పుడు కూర్చున్న ప్రాంతానికి వెళ్లి తదేకంగా చూశారు. కొంత సేపటి తర్వాత గాంధీజీ శైలిలో అక్కడే కూర్చున్నారు. ఛరఖా తిప్పి, నూలు వడికారు. గాంధీజీ స్టైల్లో ఆయన కూర్చున్న విధానం అందరినీ ఆకట్టుకుంటోంది. పర్యటనలో భాగంగా మోదీ మహాత్మాగాంధీకి ఆధ్యాత్మిక గురువుగా పేర్కొనే ‘శ్రీమద్‌ రామచంద్ర’ స్మారక తపాలా బిళ్లను, నాణేన్ని కూడా విడుదల చేశారు.
Samayam Telugu pm narendra modi spins charkha at the sabarmati ashram in ahmedabad
మహాత్మా గాంధీ శైలిలో నరేంద్ర మోదీ!

Gujarat: PM Narendra Modi visits Sabarmati Ashram in Ahmedabad pic.twitter.com/SfpEeE9Cle — ANI (@ANI_news) June 29, 2017
అనంతరం మోదీ.. అహ్మదాబాద్‌ నుంచి రాజ్‌కోట్‌ వెళ్లారు. రేస్‌కోర్సు మైదానంలో జరిగిన కార్యక్రమంలో 18 వేల మంది దివ్యాంగులకు సహాయక సాధనాలను పంపిణీ చేశారు. అక్కడ ఏర్పాటు చేసిన వేదికపై ప్రసంగిస్తూ.. ‘రాజ్‌కోట్ ప్రజల ఆదరాభిమానాలను ఎప్పటికీ మరచిపోను. మీరు గెలిపించడం వల్లే ఇవాళ ఢిల్లీ వరకూ చేరుకోగలిగాను’ అని పేర్కొన్నారు. ఆ తర్వాత ఆజీ ఆనకట్ట వద్ద నర్మదా నదీ జలాలకు స్వాగతం పలికారు.

గుజరాత్‌లో రెండు రోజుల పాటు పర్యటించనున్న మోదీ శుక్రవారం ఆరావళి జిల్లాలోని మోదస పట్టణంలో నీటి సరఫరా పథకాలను ప్రారంభించనున్నారు. ఆ తర్వాత గాంధీనగర్‌ చేరుకుని అంతర్జాతీయ జౌళి సదస్సును ప్రారంభిస్తారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.