యాప్నగరం

భారత గగనతలంలో పాక్ చాపర్.. అందులో ఎవరున్నారంటే?

ఇరుదేశాల మధ్య కుదిరిన ఒప్పందానికి విరుద్ధంగా పాక్ హెలికాప్టర్ ఆదివారం మధ్యాహ్నం సమయంలో భారత గగనతలంలోకి ప్రవేశించింది.

Samayam Telugu 1 Oct 2018, 10:29 am
ఆదివారం మధ్యాహ్నం సమయంలో పాకిస్థాన్‌కు చెందిన హెలికాప్టర్ భారత గగనతలంలో చక్కర్లు కొట్టిన సంగతి తెలిసిందే. నిబంధనలను అతిక్రమించి పాక్ చాపర్ నియంత్రణ రేఖ దాటి పూంచ్ సెక్టార్లోకి ప్రవేశించింది. ఈ హెలికాప్టర్లో పాక్ ఆక్రమిత కశ్మీర్ ప్రధాన మంత్రి రాజా ఫరూఖ్ హైదర్ ఖాన్ ఉన్నట్టు తెలుస్తోంది. భారత సైన్యం వెంటనే అప్రమత్తం కావడంతో ఈ చాపర్ వెంటనే పాక్ గగనతలంలోకి వెళ్లిపోయింది.
Samayam Telugu chopper


పీవోకేలోని టరోరీ ప్రాంతంలో ల్యాండ్ అయ్యేందుకు ఖాన్ ప్రయత్నించగా.. హెలికాప్టర్ భారత్‌లోకి ప్రవేశించిందని పాకిస్థాన్ మీడియా తెలిపింది. నిబంధనలను అతిక్రమించి పాక్ చాపర్ మన గగనతలంలోకి ప్రవేశించడంతో.. హెచ్చరికగా భారత సైన్యం కాల్పులు జరిపింది. పాక్ ఉగ్రవాదం గురించి ఐరాసలో సుష్మా స్వరాజ్ ప్రసంగించిన తరుణంలోనే ఈ ఘటన చోటు చేసుకోవడం గమనార్హం.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.