యాప్నగరం

ఎస్‌ఐ దారుణ హత్య..

ఆయన నిజాయతీ గల పోలీస్ ఇన్‌స్పెక్టర్.. తన పనితీరుతో ఉన్నాతాధికారులను ఆకట్టుకొని 2 నెలల కిందటే ప్రమోషన్‌ పొందారు. రాష్ట్ర పోలీసు శిక్షణా కేంద్రానికి బదిలీ అయ్యారు. చాలా రోజుల తర్వాత 2 రోజుల విరామం లభించడంతో..

TNN 11 Sep 2017, 8:31 pm
ఆయన నిజాయతీ గల పోలీస్ ఇన్‌స్పెక్టర్.. తన పనితీరుతో ఉన్నాతాధికారులను ఆకట్టుకొని 2 నెలల కిందటే ప్రమోషన్‌ పొందారు. రాష్ట్ర పోలీసు శిక్షణా కేంద్రానికి బదిలీ అయ్యారు. చాలా రోజుల తర్వాత 2 రోజుల విరామం లభించడంతో తన భార్యపిల్లలను చూడటానికి 70 కి.మీ. దూరంలోని స్వగ్రామానికి వెళ్లారు. మళ్లీ విధుల్లో చేరడానికి సోమవారం (సెప్టెంబర్ 11) వేకువజామునే బయలుదేరారు. మరికొద్ది సేపట్లో గమ్యం చేరుకోవాల్సి ఉండగా.. ఆయన ప్రయాణిస్తున్న కారు వెనకే వచ్చిన మరో కారులోని వ్యక్తులు టైరు ఊడిపోతోందంటూ సైగలు చేశారు. ఆయన కారు ఆపి టైర్లను పరిశీలించడానికి కిందకి దిగగానే ఒక్కసారిగా కాల్పులు జరిపి పరారయ్యారు. ఈ హఠాత్మరిణామంతో ఆయన అక్కడికక్కడే కుప్పకూలిపోయారు.
Samayam Telugu police inspector shot dead near pune
ఎస్‌ఐ దారుణ హత్య..


మహారాష్ట్రలోని పుణె నగర సమీపంలో జరిగిన ఈ ఘటనలో మహేష్‌ తెలాంగ్జి అనే పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌‌ దుండగుల చేతిలో దారుణ హత్యకు గురయ్యారు. పుణె నగరానికి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న యావత్‌ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. దుండగులు అతి సమీపం నుంచి కాల్పులు జరపడంతో మహేష్‌ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

సమాచారం అందుకున్న పోలీసు ఉన్నతాధికారులు అక్కడికి చేరుకొని ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలింపు చేపట్టారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.