యాప్నగరం

Kulgam: జమ్మూకశ్మీర్‌లో గ్రైనేడ్ దాడి... ఒక పోలీస్ మృతి

జమ్మూకశ్మీర్‌లో( (Kulgam)) మరోసారి ఉగ్రవాదులు రెచ్చిపోయారు. కుల్గామ్ జిల్లాలో గ్రైనేడ్ దాడి జరిగింది. ఆ దాడిలో ఓ పోలీసు సిబ్బంది ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన శనివారం జరిగింది. ఈ విషయంలో జమ్మూకశ్మీర్ పోలీసులు ధ్రువీకరించారు. దాడిలో తాహిర్ ఖాన్ అనే పోలీసు చనిపోయినట్టు ట్విట్టర్‌లో పేర్కొన్నారు. కాగా రాజౌరీ జిల్లాలోని ఆర్మీ క్యాంపుపై ఆత్మాహుతి దాడిని భారత సైన్యం నిర్వీర్యం చేసిన కొన్ని రోజుల తర్వాత ఈ దాడి జరగడం గమనార్హం.

Authored byAndaluri Veni | Samayam Telugu 14 Aug 2022, 10:41 am

ప్రధానాంశాలు:

  • చనిపోయిన పోలీస్ తాహిర్‌ఖాన్
  • భద్రతను పెంచిన కశ్మీర్ పోలీసులు
  • ప్రధాన కూడళ్లల్లో ముమ్మరంగా తనిఖీలు
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Grenade incident  in Kulgam
జమ్మూకశ్మీర్‌లోని కుల్గామ్ (Kulgam) జిల్లాలోని ఖైమోలో గ్రైనేడ్ దాడి జరిగింది. శనివారం జరిగిన గ్రైనేడ్ దాడిలో ఒక పోలీస్ సిబ్బంది మరణించినట్టు పోలీసులు తెలిపారు. ఇందులో పూంచ్‌లోని మెంధార్‌కు చెందిన తాహిర్ ఖాన్ అనే పోలీసు గాయపడ్డాడు. చికిత్స నిమిత్తం అనంత్‌నాగ్‌లోని ప్రభుత్వ వైద్య కళాశాల ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్టు కశ్మీర్ పోలీసులు తెలిపారు.
"ఖైమోలో నిన్న రాత్రి గ్రెనేడ్ ఘటన జరిగింది. ఈ ఉగ్రదాడి ఘటనలో పూంచ్‌లోని మెంధార్‌కు చెందిన తాహిర్ ఖాన్ అనే పోలీసు సిబ్బంది గాయపడ్డాడు. అతడిని చికిత్స కోసం అనంత్‌నాగ్‌లోని GMC ఆస్పత్రికి తరలించారు. అక్కడ అతను మరణించాడు. బలిదానం చేశాడు." అని కశ్మీర్ జోన్ పోలీసులు ఆదివారం ఉదయం ట్వీట్ చేశారు.


రాజౌరీ జిల్లాలోని ఆర్మీ క్యాంపుపై ఆత్మాహుతి దాడిని భారత సైన్యం నిర్వీర్యం చేసిన కొన్ని రోజుల తర్వాత గ్రెనేడ్ దాడులు జరిగాయి. ఇందులో ఇద్దరు ఉగ్రవాదులు మరణించారు. ముగ్గురు ఆర్మీ సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. ఆత్మాహుతి బాంబు దాడికి పాల్పడుతున్న ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టే క్రమంలో మరికొంతమంది భారత ఆర్మీ జవాన్లు గాయపడ్డారు. మరోవైపు 76వ స్వాతంత్ర్య దినోత్సవం నేపథ్యంలో కశ్మీర్‌లో భద్రతను కట్టుదిట్టం చేశారు.

అందులో భాగంగా శ్రీనగర్ నగరంలోని ప్రధాన మార్కెట్లలో ఏరియల్ వాచ్ నిర్వహిస్తున్నారు. దేశంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగక్కుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. డ్రోన్‌లు, స్నిపర్లు, సాధారణ దుస్తుల్లో ఉన్న పోలీసులను నిఘా కోసం మోహరించారు. అనేక ప్రదేశాల్లో వాహనాలను తనిఖీ చేస్తున్నారు. ప్రధాన కూడళ్లలో సోదాలు నిర్వహిస్తున్నారని శ్రీనగర్ పోలీసులు ట్విట్టర్‌లో పేర్కొన్నారు. కాగా ఈ వారం ప్రారంభంలో బుద్గామ్‌లో ముగ్గురు లష్కరే తోయిబా (ఎల్‌ఈటీ) ఉగ్రవాదులను కూడా భద్రతా దళాలు మట్టుమెట్టాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.