యాప్నగరం

తప్పు వార్త.. వెబ్‌సైట్ ఫౌండర్ అరెస్టు

అల్లర్లు సృష్టించేలా కథనాలు రాసిన వెబ్‌సైట్ వ్యవస్థాపకుడ్ని బెంగళూరు పోలీసులు అరెస్టు చేశారు. ఇటీవల జైన మత సన్యాసి రోడ్డు

Samayam Telugu 30 Mar 2018, 1:29 pm
అల్లర్లు సృష్టించేలా కథనాలు రాసిన వెబ్‌సైట్ వ్యవస్థాపకుడ్ని బెంగళూరు పోలీసులు అరెస్టు చేశారు. ఇటీవల జైన మత సన్యాసి రోడ్డు ప్రమాదంలో గాయపడగా.. ముస్లిం యువకులు అతనిపై దాడి చేసి గాయపర్చారని పోస్ట్‌కార్డు వెబ్‌సైట్‌లో వార్త వచ్చింది. దీంతో.. ఫిర్యాదు అందుకున్న బెంగళూరు సిటీ క్రైం బ్రాంచ్ పోలీసులు విచారణ జరిపి వెబ్‌సైట్ వ్యవస్థాపకుడ్ని అరెస్టు చేశారు. భాజపాకి అనుకూలమైన కథనాలను ఈ వెబ్‌సైట్ రాస్తున్నట్లు గతంలో విమర్శలు వచ్చాయి.
Samayam Telugu 500


పోలీసు కమిషనర్ సతీష్ కుమార్ తెలిపిన కథనం ప్రకారం.. మార్చి 11న హాసన్ జిల్లా శ్రవణబెలగోలాలో గోమతేశ్వర మహామస్తాభిషేక కార్యక్రమంలో పాల్గొనేందుకు జైన మత సన్యాసి కారులో వెళుతూ రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. అయితే ముస్లిం యువకులు దాడిలో ఆయన గాయపడ్డారని పోస్ట్‌కార్డు వెబ్‌సైట్‌లో వార్తలు వచ్చాయి. ఇవి సమాజంలో అల్లర్లు సృష్టించేలా ఉండటంతో.. అలా రాసిన వెబ్‌‌సైట్ ఫౌండర్‌ మహేష్ విక్రమ్ హెగ్డేని అరెస్టు చేసినట్లు తెలిపారు. మీడియా వారిని అరెస్టు చేయడం హేయమైన చర్య అంటూ భాజపా ఎంపీ ప్రతాప్ సింహా ట్విట్టర్‌లో రాష్ట్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.