యాప్నగరం

బీజేపీ నేతల ప్రవేశాన్ని నిషేదించిన కాలనీ!

బీజేపీపై నిరసన వ్యక్తం చేస్తూ.. ఆ కాలనీవాసులు ఆ పార్టీ నేతల ప్రవేశాన్ని నిషేదించారు. ఈ సందర్భంగా కాలనీ అంతటా పోస్టర్లు అతికించారు.

Samayam Telugu 15 Apr 2018, 4:50 pm
కాలనీ బీజేపీ నేతల ప్రవేశాన్ని నిషేదించింది. దయచేసి మా కాలనీలో అడుగుపెట్టవద్దంటూ పోస్టర్లను ఏర్పాటు చేసింది. ఇదేదో ప్రత్యేక హోదాలో భాగం అనుకుంటే పొరపాటే. పైగా ఇది ఆంధ్రప్రదేశ్‌లో కూడా కాదు. దేశంలో మహిళలపై జరుగుతున్న దాడులు, అత్యాచారాలకు నిరసనగా ఉత్తరప్రదేశ్‌లోని అలహాబాద్‌లోని శివకోటి కాలనీవాసులు ఈ వినూతన నిరసనకు తెరతీశారు.
Samayam Telugu Poster


‘‘ఈ కాలనీలోకి బీజేపీ నేతలు, కార్యకర్తల ప్రవేశం నిషేదం. ఎందుకంటే ఈ కాలనీలో మహిళలు, చిన్నారులు నివసిస్తున్నారు’’ అని పోస్టర్లలో పేర్కొన్నారు. ఉన్నవ్‌లో బీజేపీ ఎమ్మెల్యేపై అత్యాచారం కేసు నమోదైన రోజు నుంచి ఈ కాలనీవారు ఆ పార్టీ నేతల ప్రవేశాన్ని నిషేదించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.