యాప్నగరం

పేలిన మొబైల్ పవర్ బ్యాంక్.. మహిళ అరెస్ట్

మొబైల్ పవర్ బ్యాంక్ పేలుడు.. చివరికి ఆ మహిళ అరెస్టుకు దారి తీసింది. ఢిల్లీ విమానాశ్రయంలో చోటు చేసుకున్న ఘటన వివరాలు ఇలా ఉన్నాయి.

Samayam Telugu 30 Aug 2018, 11:57 pm
మొబైల్ పవర్ బ్యాంక్ పేలుడు.. చివరికి ఆ మహిళ అరెస్టుకు దారి తీసింది. ఢిల్లీ విమానాశ్రయంలో చోటు చేసుకున్న ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. 55 ఏళ్ల మహిళ మంగళవారం ఢిల్లీలోని అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్లింది. ఆమె లగేజ్ తనిఖీ చేసిన భద్రతా సిబ్బంది బ్యాగేజీ నుంచి పవర్ బ్యాంక్‌ను తీసేయాలని సూచించారు.
Samayam Telugu Untitled1


దీంతో ఆమె భద్రతా సిబ్బందితో వాగ్వాదానికి దిగింది. కోపంతో పవర్ బ్యాంక్‌ను నేలకేసి కొట్టడంతో.. అది పెద్ద శబ్ధం చేస్తూ పేలింది. ఆ ఘటనకు అక్కడే ఉన్న ప్రయాణికులు ఉలిక్కిపడ్డారు. దీంతో పోలీసులు సెక్షన్ 336 కింద (ఇతరుల ప్రాణాలకు హానికలిగేలా వ్యవహరిచడం), సెక్షన్ 285 (ప్రమాదకర వస్తువులతో నిర్లక్ష్యం) కింద కేసులు నమోదు చేసి అరెస్టు చేశారు. ప్రస్తుతం ఆమె బెయిల్‌పై విడుదలైనట్లు ఎయిర్ పోర్ట్ డిప్యుటీ కమిషనర్ సంజయ్ భటియా తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.