యాప్నగరం

అర్జన్‌ సింగ్ భౌతిక కాయానికి రామ్‌నాథ్ నివాళి

గుండెపోటుతో మరణించిన భారత ఎయిర్ చీఫ్ మార్షల్ అర్జన్ సింగ్ భౌతికకాయానికి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నివాళులర్పించారు.

TNN 17 Sep 2017, 5:43 pm
గుండెపోటుతో మరణించిన భారత ఎయిర్ చీఫ్ మార్షల్ అర్జన్ సింగ్ భౌతికకాయానికి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నివాళులర్పించారు. తీవ్ర గుండెపోటు రావడంతో ఆసుపత్రిలో చేరిన అర్జన్ సింగ్ శనివారం రాత్రి తుది శ్వాస విడిచిన సంగతి తెలిసిందే. ప్రముఖుల సందర్శనార్థం అర్జన్ సింగ్ భౌతికకాయాన్ని ఆయన నివాసంలో ఉంచారు. ఆదివారం మధ్యాహ్నం అర్జన్ సింగ్ నివాసానికి వెళ్లిన రాష్ట్రపతి.. ఆయన భౌతికకాయానికి నివాళులర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ విషయాన్ని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ట్విట్టర్ ఖాతా ద్వారా తెలియజేశారు.
Samayam Telugu president kovind lays wreath at his residence in new delhi
అర్జన్‌ సింగ్ భౌతిక కాయానికి రామ్‌నాథ్ నివాళి

Nation mourns the death of Marshal of the IAF Arjan Singh. #PresidentKovind lays wreath at his residence in New Delhi 1/2 pic.twitter.com/ufDQWMSwbM — President of India (@rashtrapatibhvn) September 17, 2017
‘భారత వైమానిక దళానికి అర్జన్ సింగ్ ఎప్పటికీ ఆదర్శప్రాయుడు. ఆయన కీర్తి ఆకాశాన్ని తాకింది. ధైర్యసాహసాలు కలిగిన ఈ భరతమాత బిడ్డని జాతి ఎన్నటికీ మరిచిపోదు’ అని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పేర్కొన్నారు. కాగా, అర్జన్‌ సింగ్‌ భౌతిక కాయానికి సోమవారం అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలను నిర్వహిస్తున్నట్లు కేంద్ర హోం శాఖ ప్రకటించింది. ఆయన గౌరవార్థం సోమవారం అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో జాతీయ పతాకాన్ని తక్కువ ఎత్తులో ఎగురవేయాలని ఆదేశాలు జారీ చేసింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.