యాప్నగరం

చట్టరూపం దాల్చిన వ్యవసాయ బిల్లులు.. రాష్ట్రపతి ఆమోదం

Ram Nath Kovind: వ్యవసాయ బిల్లులకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆమోదముద్ర వేశారు. దీంతో మూడు బిల్లులు చట్ట రూపం దాల్చాయి.

Samayam Telugu 27 Sep 2020, 7:19 pm
టీవల పార్లమెంట్ ఆమోదించిన వ్యవసాయ బిల్లులకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కొవింద్ ఆమోదముద్ర వేశారు. ఈ బిల్లులపై హర్యానా, పంజాబ్ రాష్ట్రాలతో పాటు దేశంలోని పలు ప్రాంతాల్లో ఆందోళనలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. కాంగ్రెస్, టీఆర్‌ఎస్, వామపక్ష పార్టీలు సహా పలు విపక్ష పార్టీలు ఈ బిల్లులను వ్యతిరేకించాయి. విపక్షాల తరఫున కాంగ్రెస్ నేత గులాంనబీ ఆజాద్ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను కలిసి బిల్లులను వెనక్కి పంపించాలని కోరారు. వీటిపై పలు ప్రాంతాల్లో ఆందోళనలు కొనసాగుతుండగానే రాష్ట్రపతి ఆమోదముద్ర వేయడం గమనార్హం. రాష్ట్రపతి ఆమోదంతో ఈ 3 బిల్లులు చట్టరూపం దాల్చాయి.
Samayam Telugu వ్యవసాయ బిల్లులకు రాష్ట్రపతి ఆమోదం
Farm Bills


Also Read: దేశంలోకి మరో సరికొత్త రైలు.. డిజైన్ విడుదల చేసిన కేంద్రం

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.