యాప్నగరం

రాష్ట్రపతి రేసులో.. అనూహ్య వ్యక్తులు..?!

రాష్ట్రపతి ఎన్నికల్లో తమ అభ్యర్థి ఎవరనే అంశంపై అధికార ఎన్డీయే కూటమి ఎలాంటి స్పష్టతనూ ఇవ్వడం లేదు

TNN 18 Jun 2017, 1:03 pm
రాష్ట్రపతి ఎన్నికల్లో తమ అభ్యర్థి ఎవరనే అంశంపై అధికార ఎన్డీయే కూటమి ఎలాంటి స్పష్టతనూ ఇవ్వడం లేదు. దాదాపు ఏడాది కాలం నుంచి ఎన్డీయే తరపున రాష్ట్రపతి అభ్యర్థులంటూ అనేక మంది పేర్లు వినిపిస్తూనే ఉన్నాయి. సీనియర్ నేత అద్వానీ మొదలు అనేక మంది నేతల పేర్లు ఈ జాబితాలో వినిపించాయి. అయితే అభ్యర్థిత్వం విషయంలో కమలం పార్టీ ఎలాంటి స్పష్టతను ఇవ్వడం లేదు. తాము ప్రతిపాదించిన అభ్యర్థిని సులభతరంగా గెలిపించుకునేందుకు ఎన్డీయేత పార్టీలను కూడా కలుపుకుపోతున్న కమలనాథులు.. అభ్యర్థి ఎవరనే అంశం పై మాత్రం గుంభనంగా ఉంటున్నారు.
Samayam Telugu presidential elections quite interesting
రాష్ట్రపతి రేసులో.. అనూహ్య వ్యక్తులు..?!


అద్వానీ, ద్రౌపది ముర్ము, మురళీ మనోహర్ జోషి.. వంటి పేర్ల అనంతరం సుష్మా స్వరాజ్ పేరు ప్రస్తుతం వినిపిస్తోంది. ఈ సీనియర్ నేతను రాష్ట్రపతిగా చేయాలని కమలం పార్టీ భావిస్తున్నట్టుగా వార్తలు వచ్చాయి. అయితే సుష్మ అభ్యర్థిత్వం విషయంలో కూడా ఎలాంటి అధికారిక ధ్రువీకరణ లేదు.

ఆ సంగతలా ఉంటే రాష్ట్రపతి రేసులో కొన్ని డార్క్ హార్స్ లు ఉన్నాయనే మాటా వినిపిస్తోంది. ఎవ్వరూ ఊహించని వాళ్లను అభ్యర్థులుగా ప్రకటించే అవకాశాలున్నాయనే ప్రచారం సాగుతోంది. మెట్రో శ్రీధరన్ లాంటి వాళ్ల పేర్లు తెరపైకి రావడం.. ఏమైనా జరగొచ్చు, ఎవరైనా ఎన్డీయే అభ్యర్థిగా కావొచ్చు.. అనే అభిప్రాయాలకు కారణం అవుతోంది. గతంలో అబ్దుల్ కలాం వంటి శాస్త్రవేత్తను ఎన్డీయే రాష్ట్రపతిగా చేసింది. ఇప్పుడు కూడా రాజకీయం కాకుండా వైవిధ్యమైన నేపథ్యం ఉన్న అభ్యర్థిని నిలిపినా ఆశ్చర్యపోనక్కర్లేదనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. మరి ఎన్డీయే ఎంపిక ఎవరో!

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.