యాప్నగరం

‘పంజాబ్ సీఎం’పై కేజ్రీవాల్ క్రేజీ ఆన్సర్!

పంజాబ్ సీఎం అభ్యర్థి రేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఉన్నారంటూ గత కొంతకాలం వస్తున్న వార్తలకు బుధవారం ఆయన ముగింపు పలికారు.

TNN 11 Jan 2017, 6:03 pm
పంజాబ్ సీఎం అభ్యర్థి రేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఉన్నారంటూ గత కొంతకాలం వస్తున్న వార్తలకు బుధవారం ఆయన ముగింపు పలికారు. ఈ మేరకు టైమ్స్ ఆఫ్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన వెల్లడించారు. ‘ఒక లోకల్ ఎమ్మెల్యేనే పంజాబ్ సీఎం కాగలడు. ఆప్ చేసిన ప్రతి ప్రమాణాన్ని నెరవేర్చవలసిన బాధ్యత నాపై ఉంది’ అని అన్నారు. అలాగే ‘పాకిస్తాన్, లండన్, ఫ్రాన్స్‌కు చెందిన వారు పంజాబ్ ముఖ్యమంత్రి కాలేరు. అతను కచ్చితంగా ఈ రాష్ట్రానికి చెందినవాడై ఉండాలి’ అని కుండబద్దలు కొట్టారు. దీంతో పంజాబ్ సీఎంగా కేజ్రీవాల్ పోటీచేయనున్నారన్న వార్తలు శుభం కార్డు పడినట్లయింది.
Samayam Telugu punjab cm cant be from pakistan or london he will be a local mla arvind kejriwal clarifies
‘పంజాబ్ సీఎం’పై కేజ్రీవాల్ క్రేజీ ఆన్సర్!


‘నేను ఢిల్లీకి ముఖ్యమంత్రిని. ఢిల్లీ ప్రజలు నాకు చాలా బాధ్యతలు అప్పగించారు. కాబట్టి నేను పంజాబ్‌కి సీఎంని కావడం అసంభవం’ అని కేజ్రీవాల్ తేల్చి చెప్పారు. మరోవైపు కేజ్రీవాల్‌ను పంజాబ్ సీఎంను చేయడానికి ఓటు వేయండి అని అడిగిన ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను కేజ్రీవాల్ వెనకేసుకొచ్చారు. ఆయన మాట్లాడిన దానిలో తప్పేమీ లేదని చెప్పారు. మంగళవారం మొహాలీలో ర్యాలీ నిర్వహించిన సిసోడియా.. కేజ్రీవాల్‌ను సీఎం అభ్యర్థిగా నిలబెట్టడానికి మీరు ఓటు వేయండి అని ప్రజలను కోరారు. దీంతో పంజాబ్ సీఎం రేసులో కేజ్రీవాల్ ఉన్నారనే వాదన మరింత ఎక్కవగా వినిపించింది. మొత్తానికి వీటన్నింటికీ కేజ్రీ శుభం పలికేసారు.
BRK:@ArvindKejriwal tells me in Patiala: Punjab CM will be from Punjab.Not from Pak,London or France.Sisodia commnt got Sukhbir,Capt rattled pic.twitter.com/9zYsJpPjQ2 — Rohan Dua (@rohanduaTOI) January 11, 2017

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.