యాప్నగరం

Punjab: వీసీని మురికి బెడ్‌పై పడుకోమన్న మంత్రి... చెలరేగిన దుమారం

పంజాబ్ (Punjab) ఆరోగ్య శాఖ మంత్రి చేతన్ సింగ్ వ్యవహరించిన తీరు వివాదాస్పదం అయింది. ఫరీద్‌కోట్‌లోని బాబా ఫరీద్ హెల్త్ సైన్స్ యూనివర్సిటీ వీసీ డాక్టర్ రాజ్ బహదూర్‌ను మురికిగా ఉన్న ఆస్పత్రి బెడ్‌పై పడుకోమన్నారు. దాంతో ఆయన కంగుతిన్నారు. ఆ టైంలో అక్కడో మంచం మీద పరుపు చాలా మురికిగా ఉంది. దాంతో డాక్టర్ రాజ్ బహదూర్‌ను దానిపై పడుకోమన్నారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఈ అంశం వివాదాస్పదం అయింది.

Authored byAndaluri Veni | Samayam Telugu 30 Jul 2022, 1:25 pm

ప్రధానాంశాలు:

  • పంజాబ్‌లో చెలరేగిన వివాదం
  • ఆస్పత్రి తనిఖీకి వెళ్లిన మంత్రి చేతన్ సింగ్
  • మంత్రి వ్యవహరించిన తీరుపై విమర్శలు

హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu ఆస్పత్రిలో మంత్రి
పంజాబ్‌లో (Punjab) మరో దుమారం చెలరేగింది. ఈసారి ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి చేతన్ సింగ్ జౌరమజ్రా వివాదానికి కేంద్ర బిందువుగా మారారు. మంత్రి చేతన్ సింగ్ ఫరీద్‌కోట్‌లోని బాబా ఫరీద్ హెల్త్ సైన్స్ యూనివర్సిటీ వీసీ డాక్టర్ రాజ్ బహదూర్‌ను మురికిగా ఉన్న ఆస్పత్రి బెడ్‌పై పడుకోమన్నారు. దాంతో ఆయన కంగుతిన్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వ్యవహారం వివాదాస్పదం అయింది. ఆ యూనివర్సిటీ ఆస్పత్రిని రాష్ట్ర మంత్రి చేతన్ సింగ్ జౌరాముజ్రా ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆ టైంలో అక్కడో మంచం మీద పరుపు చాలా మురికిగా ఉంది. దాంతో డాక్టర్ రాజ్ బహదూర్‌ను దానిపై పడుకోమన్నారు.

రాజ్ బహదూర్ మంచి పేరున్న వైద్య, ఆరోగ్య రంగ నిపుణుడు కావడంతో ఈ సంఘటనకు సంబంధించిన వీడియోలను ప్రతిపక్ష నేతలు కూడా సామాజిక మాధ్యమాల్లో షేర్ చేస్తూ, ఆరోగ్య శాఖ మంత్రి చేతన్ సింగ్‌ను ఘాటుగా విమర్శిస్తున్నారు. మంత్రి తన పదవిని దుర్వినియోగం చేశారని బీజేపీ నాయకులు ఆరోపించారు. మంత్రి యూనివర్సిటీ వీసీతో అసభ్యంగా ప్రవర్తించడం దారుణం మాత్రమే కాదు.. అవమానకరం అని కూడా కాంగ్రెస్ నేత పవన్ కుమార్ బన్సాల్ ట్వీట్ చేశారు.


సీనియర్ వైద్యుడిని కించపరిచినందుకు పంజాబ్ మంత్రిని బీజేపీ నాయకుడు మంజీందర్ సింగ్ సిరా మంత్రిని ఆక్షేపించారు. ఇది అసహ్యకరమైన ప్రవర్తన అని ట్వీట్ చేశారు. ఈ అహంకారపూరిత ప్రవర్తనకు బాధ్యత వహించాలని ట్వీట్‌లో పేర్కొన్నారు. ప్రతిపక్ష నాయకులతోపాటు.. కొంతమంది వైద్యులు కూడా ఈ సంఘటనను ఖండించారు. ఓ సీనియర్ డాక్టర్ పట్ల ఇటువంటి కఠినమైన ప్రవర్తన సరికాదని అభిప్రాయపడ్డారు. మరోవైపు మంత్రి చేసిన అవమానంపై వీసీ రాజ్ బహదూర్ తీవ్రమైన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఆయన తన పదవి నుంచి వైదొలగినట్టు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి.
ఇదిలా ఉండగా యూనివర్సిటీ ఆస్పత్రిలో నిర్వహించిన తనిఖీల అనంతరం మంత్రి చేతన్ శుక్రవారం ఆస్పత్రిలో సదుపాయాలను మెరుగుపరచాలని సంబంధిత అధికారులను ఆదేశించానని చెప్పారు.
ఆస్పత్రిలోని ఇతర సమస్యలు కూడా ఉన్నాయని, వాటిని పరిష్కరిస్తామని చెప్పుకొచ్చారు. 15 రోజుల తర్వాత మళ్లీ ఈ ఆసుపత్రిలో తాను తనిఖీలు చేస్తానన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.