యాప్నగరం

పంజాబ్ విషాదం: ఆ శబ్దాలే ప్రాణం తీశాయ్!

దసరా వేడుకల్లో భాగంగా నిర్వహించిన రవాణ దహనాన్ని చూసేందుకు రైల్వే ట్రాక్‌పై నిలబడిన జనంపైకి నుంచి దూసుకెళ్లిన రైలు. పెరుగుతున్న మృతుల సంఖ్య.

Samayam Telugu 20 Oct 2018, 2:26 am
పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో చోటుచేసుకున్న ఘోర ప్రమాదంలో మృతులసంఖ్య పెరుగుతోంది. అధికారుల లెక్క ప్రకారం ఇప్పటివరకు 60 మంది వరకు చనిపోయారు. అయితే, మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. దసరా సందర్భంగా జోదా ఫటక్ ప్రాంతంలోని మైదనాంలో రావణ దహనం కార్యక్రమం నిర్వహించారు.
Samayam Telugu Dp4NgCsWoAEGTZe


ఈ వేడుకను చూసేందుకు భారీ సంఖ్యలో ప్రజలు పరిసర ప్రాంతాలకు చేరుకున్నారు. సుమారు 600 నుంచి 700 మంది రైలు పట్టాలపైకి ఎక్కి రావణ దహనాన్ని వీక్షిస్తున్నారు. రావణుడి విగ్రహం దహనం సమయంలో భారీగా బాణాసంచా పేలింది. దీంతో రైలు పట్టాలపై నిల్చున్న జనానికి రైలు కూత వినపడలేదు. ఆ సమయంలో రైలు వేగంగా ఉండటంతో గుర్తించేలోపే ఘోరం జరిగిపోయింది. రెప్పపాటు వ్యవధిలో నిండు ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. శరీరాలు చిధ్రమయ్యాయి.
రాష్టప్రతి, ప్రధాని సంతాపం: పంజాబ్‌ ప్రమాద ఘటనపై రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. క్షతగాత్రులను ఆదుకోడానికి రైల్వే, స్థానిక యంత్రాంగం సాయం చేయాలని కోరారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ స్పందిస్తూ.. రైలు దుర్ఘటన తనను తీవ్ర మనస్తాపానికి గురిచేసిందన్నారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలన్నారు. మృతుల కుటుంబాలకు సానుభూతి వ్యక్తం చేశారు. ప్రమాద స్థలంలో తక్షణం సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కాంగ్రెస్ కార్యకర్తలంతా సహాయక చర్యల్లో పాల్గోవాలని సూచించారు. కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌, రైల్వే శాఖ మంత్రి పియూష్ గోయాల్ తదితర నేతలు ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
రూ.5 లక్షల పరిహారం: ప్రమాదం వార్త తెలియగానే పంజాబ్‌ ముఖ్యమంత్రి అమరీందర్‌ సింగ్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులను రక్షించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని, జిల్లా అధికారులు వెంటనే ఘటనా స్థలికి చేరకుని సహాయక చర్యలు పర్యవేక్షించాని ఆయన ఆదేశించారు. మాదంలో మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. పంజాబ్ ఘటనపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కెజ్రీవాల్ కూడా స్పందించారు. ప్రమాదవార్త తనను షాక్‌కు గురిచేసిందన్నారు. అంతా స్వచ్ఛంగా ముందుకొచ్చి సాయం చేయాలని కోరారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.