యాప్నగరం

నోట్లు రద్దుకు 30 రోజులు..అయినా కొనసాగుతున్న కష్టాలు

పెద్ద నోట్లను రద్దు చేసి నెల రోజులు అవుతున్నా దేశంలో కరెన్సీ కష్టాలు కొనసాగుతూనే ఉన్నాయి.

TNN 9 Dec 2016, 9:04 am
పెద్ద నోట్లను రద్దు చేసి నెల రోజులు అవుతున్నా దేశంలో కరెన్సీ కష్టాలు కొనసాగుతూనే ఉన్నాయి. పాత నోట్లకు కొత్త నోట్లు ఇచ్చే ప్రక్రియ సామాన్యులకు మినహాయిస్తే షరా మామూలుగానే నల్లబాబులకు మాత్రమే నల్లేరుమీద నావలా సాఫీగా సాగిపోతోంది. దేశంలో వివిధ ప్రాంతాల్లో నల్ల కుబేరుల వద్ద కోట్లాదిగా దొరుకుతున్న సరికొత్త రూ.2వేలు, రూ.500 నోట్లు దేశ ప్రజానీకాన్ని విస్తుగొలుపుతున్నాయి. ఈ నేపథ్యంలో సామాన్యుల కష్టాలకు ముగింపు ఎప్పుడంటూ విపక్షాలు మళ్లీ ఆందోళనకు దిగాయి.
Samayam Telugu rahul gandhi hits out at modi govt on demonetization
నోట్లు రద్దుకు 30 రోజులు..అయినా కొనసాగుతున్న కష్టాలు


మోడీ ప్రభుత్వం పెద్ద నోట్లు రద్దు చేసి 30రోజులు గడిచిన సందర్భంగా పార్లమెంట్ ఆవరణలో విపక్షాలు ఆందోళన నిర్వహించాయి. నోట్ల రద్దు నిర్ణయాన్ని తప్పుపడుతూ బ్లాక్ డే నిర్వహించాయి. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాహుల్ మరోమారు మోడీ నిర్ణయాన్ని అనాలోచితమైనదిగా పేర్కొన్నారు. మోడి నిర్ణయాల వల్ల ప్రజలు నానా కష్టాలు పడుతున్నారన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.