యాప్నగరం

కరుణానిధి‌ని పరామర్శించిన రాహుల్, మరికొద్ది రోజులు హాస్పిటల్లోనే డీఎంకే చీఫ్

తమిళనాడు మాజీ సీఎం కరుణానిధిని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చెన్నై వెళ్లి పరామర్శించారు.

Samayam Telugu 31 Jul 2018, 7:03 pm
చెన్నై: తమిళనాడు మాజీ సీఎం కరుణానిధిని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పరామర్శించారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న కరుణానిధి గత కొద్ది రోజులుగా చెన్నైలోని కావేరీ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. డీఎంకే అధినేతను కలిసిన అనంతరం రాహుల్ మాట్లాడుతూ.. ‘‘కరుణానిధిని చూసేందుకు చెన్నై వచ్చాను. ఆయన త్వరగా కోలుకోవాలని సోనియా గాంధీ సందేశం పంపారు. కరుణ కుటుంబంతో మాకు చాలా ఏళ్లుగా అనుబంధం ఉంది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది. ఆయన తమిళనాడుకు స్ఫూర్తినిచ్చిన నేత. తమిళ ప్రజల్లాగే ఆయన దృఢంగా ఉన్నార’’న్నారు.
Samayam Telugu rahul karunanidhi.


కోట్లాది మంది ప్రజలు, అభిమానులు కరుణానిధి ఆరోగ్యం మెరుగు పడాలని ప్రార్థిస్తున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని వారితోపాటు నేను కూడా కోరుకుంటున్నానని రాహుల్ తెలిపారు.
కరుణానిధి ఆరోగ్యం మెరుగ్గా ఉందని, ఆయన చికిత్సకు స్పందిస్తున్నారని కావేరీ హాస్పిటల్ యాజమాన్యం మంగళవారం సాయంత్రం ప్రకటించింది. ఆయన మరి కొద్ది రోజులు హాస్పిటల్లోనే ఉండాల్సి ఉంటుందని తెలిపింది. కరుణానిధి ఆరోగ్యం క్షీణించిందనే వార్తలు వెలువడటంతో డీఎంకే కార్యకర్తలు భారీ సంఖ్యలో కావేరీ హాస్పిటల్‌కు చేరుకుంటున్నారు. వారిని నియంత్రించడం కష్టం కావడంతో ఆదివారం పోలీసులు లాఠీ ఛార్జీ చేయాల్సి వచ్చింది. ఈ ఘటనతో అప్రమత్తమైన పోలీస్ శాఖ హాస్పిటల్ ముందు భారీగా పోలీసులను మోహరించింది. undefined

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.