యాప్నగరం

నేడే రాహుల్ పట్టాభిషేకం.. కొత్త పాత్రలోకి అమ్మ?

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ నేడు బాధ్యతలు స్వీకరించనున్నారు. సోనియా గాంధీ ఇక కొత్త పాత్రను పోషించబోతున్నారు.

TNN 16 Dec 2017, 8:04 am
కాంగ్రెస్ పార్టీ చీఫ్‌గా యువనేత రాహుల్ గాంధీ శనివారం బాధ్యతలు స్వీకరించనున్నారు. 19 ఏళ్లుగా పార్టీ బాధ్యతల్ని మోసిన సోనియా స్థానంలో ఆయన పార్టీ అధ్యక్ష పీఠాన్ని అధిరోహించనున్నారు. ఇందుకు సంబంధించి ఢిల్లీలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. అధ్యక్ష పదవికి రాహుల్ మాత్రమే నామినేషన్ వేయడంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవమైంది. ఏఐసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్న గాంధీ-నెహ్రూ కుటుంబానికి ఆరో వ్యక్తి రాహుల్ గాంధీ కావడం విశేషం. 2013లో రాహుల్ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.
Samayam Telugu rahul gandhi to take charge as aicc president today
నేడే రాహుల్ పట్టాభిషేకం.. కొత్త పాత్రలోకి అమ్మ?


రాహుల్ పార్టీ బాధ్యతలను స్వీకరించడానికి ఒక రోజు ముందు.. రాజకీయాల నుంచి రిటైర్ అవుతున్నట్లు సోనియా గాంధీ ప్రకటించారు. కానీ ఆమె అధ్యక్ష స్థానం నుంచి మాత్రమే వైదొలుగుతున్నారని, రాజకీయాల్లో కొనసాగుతారని కాంగ్రెస్ పార్టీ క్లారిటీ ఇచ్చింది. సోనియా గాంధీ రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకోకుండా.. రాహుల్ గాంధీకి మెంటార్‌‌గా వ్యవహరించాలని ఆ పార్టీ ఆశిస్తోంది. ‘అమ్మ పాత్ర’లో సోనియా యువనేతను ముందుకు నడిపించాలని కోరుకుంటున్నామని హస్తం పార్టీ నేతలు తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.