యాప్నగరం

Rahul Gandhi: భారత్ జోడో యాత్రలో జోష్... మీసం మెలేసిన రాహుల్ గాంధీ

రాహుల్ గాంధీ చేపట్టిన (Rahul Gandhi) భారత్ జోడో యాత్ర మధ్యప్రదేశ్‌లో సాగుతుంది. ఈ యాత్ర సెప్టెంబర్ 7న కన్యాకుమారి దగ్గర ప్రారంభమైంది. ప్రతి రాష్ట్రంలో భిన్న నేపథ్యాలకు సంబంధించిన ప్రముఖ వ్యక్తులు రాహుల్ గాంధీతో పాటు యాత్రలో పాల్గొంటున్నారు. తాజాగా బాక్సర్ విజేంద‌ర్ సింగ్ కూడా యాత్రలో కలిశారు. ఈ సందర్భంగా హర్యాన్వీ స్టైల్లో తమ మీసాలు తిప్పారు. అంతేకాదు బాక్సింగ్ పంచ్ ఇస్తున్నట్టు కూడా ఫోజు ఇచ్చారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది.

Authored byAndaluri Veni | Samayam Telugu 26 Nov 2022, 2:09 pm

ప్రధానాంశాలు:

  • మధ్యప్రదేశ్‌‌లో భారత్ జోడో యాత్ర
  • ఐదు రాష్ట్రాల్లో పూర్తైన రాహుల్ యాత్ర
  • ర్యాలీలో పాల్గొన్న బాక్స‌ర్‌ విజేంద‌ర్ సింగ్
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Bharat Jodo Yatra
కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ (Rahul Gandhi) చేపట్టిన భారత్ జోడో యాత్ర నిర్విఘ్నంగా కొనసాగుతూనే ఉంది. ఇప్పటి వరకు ఐదు రాష్ట్రాల్లో పూర్తైంది. ఈ యాత్ర సెప్టెంబర్ 7న కన్యాకుమారి దగ్గర ప్రారంభమైంది. ఇంకా ఏడు రాష్ట్రాల్లో సాగనుంది. ప్రతి రాష్ట్రంలో భిన్న నేపథ్యాలకు సంబంధించిన ప్రముఖ వ్యక్తులు రాహుల్ గాంధీతో పాటు యాత్రలో పాల్గొంటున్నారు. రాహుల్ గాంధీ వ్యవహార శైలీ, ఆయన స్టైల్ యాత్రకు విభిన్నతను చేకూర్చుకుంది.
యాత్ర మొదలైన దగ్గర నుంచి రాహుల్ గాంధీ వార్తల్లో నిలుస్తున్నారు. స్థానిక ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుంది. అంతేకాకుండా యాత్రకు సంబంధించిన ఏదో ఒక వీడియో వైరల్ అవుతూనే ఉంది. తాజాగా రాహుల్ గాందీ మీసాలు తిప్పిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ప్రస్తుతం రాహుల్ గాంధీ మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఒలింపిక్ మెడ‌లిస్ట్‌, బాక్స‌ర్‌, కాంగ్రెస్ నేత విజేంద‌ర్ సింగ్ ఆ యాత్రలో పాల్గొన్నారు. ఆ స‌మ‌యంలో ఇద్ద‌రూ త‌మ మీసాలు తిప్పారు. హర్యాన్వీ స్టైల్లో తమ మీసాలు తిప్పారు. అంతేకాదు బాక్సింగ్ పంచ్ ఇస్తున్నట్టు కూడా ఫోజు ఇచ్చారు.


దీనికి సంబంధించిన వీడియోని కాంగ్రెస్ పార్టీ ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. ఆ వీడియో రాహుల్ గాంధీ, విజేందర్ సింగ్‌తో పాటు పక్కన ప్రియాంక కూడా కనిపిస్తుంది. కాగా హర్యానాలోని భివాని జిల్లాకు చెందిన విజేంద‌ర్ సింగ్‌.. గ‌త లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో దక్షిన ఢిల్లీ సీటు నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అలాగే 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో అత‌ను బ్రాంజ్ మెడ‌ల్ గెలిచాడు. మరోవైపు భారత్ జోడో యాత్ర చేపడుతున్న రాహుల్ గాంధీ గ‌డ్డం, మీసాలు పెంచుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఆయన వేషధారణపై బీజేపీ నాయకులు పలు ఆరోపణలు చేస్తున్నారు. అసోం సీఎం హిమంత శర్మ.. రాహుల్ గాంధీని చూస్తే సద్దాం హుస్సేన్‌లో కనిపిస్తున్నారని అన్నారు.

Read Also: National News and Telugu News

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.