యాప్నగరం

కాంగ్రెస్ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన రాహుల్ గాంధీ

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ బాధ్యతలు స్వీకరించారు. తల్లి సోనియా గాంధీ నుంచి ఆయన పార్టీ పగ్గాలను చేపట్టారు.

TNN 16 Dec 2017, 12:27 pm
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ బాధ్యతలు స్వీకరించారు. తల్లి సోనియా గాంధీ నుంచి ఆయన పార్టీ పగ్గాలను చేపట్టారు. పార్టీ చీప్‌గా ఇటీవలే ఏకగ్రీవంగా ఎన్నికైన ఆయన శనివారం ఉదయం లాంఛనంగా బాధ్యతలు చేపట్టారు. 19 ఏళ్లపాటు సుదీర్ఘంగా పార్టీ అధ్యక్షురాలిగా పని చేసిన సోనియా.. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. దీంతో ఇక నుంచి పార్టీ భారాన్ని రాహుల్ మోయనున్నారు. ఢిల్లీలోని 24 అక్బర్ రోడ్‌లో ఉన్న పార్టీ ప్రధాన కార్యాలయంలో రాహుల్ పార్టీ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించారు.
Samayam Telugu rahul takes charge as congress party president
కాంగ్రెస్ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన రాహుల్ గాంధీ


కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యతలను చేపట్టిన రాహుల్ గాంధీకి సోనియా అభినందనలు తెలిపారు. రాహుల్ సారథ్యంలో పార్టీని మరింత ముందుకు తీసుకెళ్లాలని ఆమె సూచించారు. ఇందిరా గాంధీ, రాజీవ్‌ల హత్యలను సోనియా ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఇందిరా తనను సొంత కూతురిలా చూసుకునేవారని తెలిపారు.

రాహుల్ అధ్యక్ష బాధ్యతలను స్వీకరించిన సందర్భంగా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మాట్లాడుతూ.. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ చరిత్రలోనే ప్రత్యేకమైందని తెలిపారు. 19 ఏళ్ల పాటు పార్టీని ముందుకు నడిపిన సోనియా గాంధీపై మన్మోహన్ ప్రశంసల జల్లు కురిపించారు. కాంగ్రెస్ హయాంలో దేశాన్ని వృద్ధిపథంలో నడిపామన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.