యాప్నగరం

ట్విట్టర్లో రాహుల్ గాంధీ జోరు.. రహస్యమిదే?

కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఇటీవలి కాలంలో ట్విట్టర్లో దూసుకెళ్తున్నారు. ఆయన దూకుడు వెనుక కారణం ఇదేనని బీజేపీ ఆరోపిస్తోంది.

TNN 22 Oct 2017, 1:06 pm
కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఇటీవలి కాలంలో ట్విట్టర్లో దూసుకెళ్తున్నారు. ఆయన ఏ ట్వీట్ చేసినా నెటిజన్ల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. గత కొద్ది నెలల్లోనే ఆయన ఫాలోవర్ల సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ హ్యాపీగా ఫీలవుతోంది. ప్రధాని మోదీ, ఢిల్లీ సీఎం అరవింద్ క్రేజివాల్ కూడా రాహుల్ దూకుడు ముందు వెనుకబడ్డారు. ఈ విషయమై బీజేపీ స్పందిస్తూ.. రాహుల్‌ చేసే ట్వీట్లకు అత్యధికంగా రీట్వీట్లు రావడానికి బోట్స్ కారణమని ఆరోపిస్తోంది. ‘ఆఫీస్ ఆఫ్ ఆర్జీ’ ఖాతా ద్వారా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు చేసే ట్వీట్లను విదేశాలకు చెందిన వారు కూడా రీట్వీట్ చేస్తున్నారు. కొన్ని ఖాతాలను పరిశీలిస్తే.. ట్వీట్లేమీ చేయకుండా కేవలం రీట్వీట్లు మాత్రమే ఉంటున్నాయని వార్తలు వెలువడుతున్నాయి.
Samayam Telugu rahuls twitter celebrity fuelled by bots says report
ట్విట్టర్లో రాహుల్ గాంధీ జోరు.. రహస్యమిదే?


బోట్స్ ద్వారా రాహుల్ ట్వీట్లను ఆటోమెటిగ్గా రీట్వీట్లు వచ్చేలా చేస్తున్నారని ఓ మీడియా కథనం తెలియజేసింది. కజకిస్థాన్, రష్యా, ఇండోనేసియా తదితర దేశాలకు చెందిన ట్విట్టర్ ఖాతాలు రాహుల్ ట్వీట్లను రీట్వీట్ చేయడం అనుమానాలకు బలం చేకూరుస్తోంది. ఈ విషయమై సమాచార ప్రసార శాఖ మంత్రి స్మృతి ఇరానీ స్పందిస్తూ.. రాహుల్ గాంధీ రష్యా, ఇండోనేసియా, కజకిస్థాన్ దేశాల ఎన్నికల్లో పోటీ చేసి భారీ మెజార్టీతో గెలుస్తారని ఎద్దేవా చేశారు. క్రీడల భాషలో చెప్పాలంటే దీన్ని డోపింగ్ అంటారని క్రీడల శాఖ మంత్రి రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్ చురకలు అంటించారు.

Mr. Modi, Cinema is a deep expression of Tamil culture and language. Don't try to demon-etise Tamil pride by interfering in Mersal — Office of RG (@OfficeOfRG) October 21, 2017
విజయ్ నటించిన తమిళ సినిమా మెర్సల్ విషయంలో రాహుల్ గాంధీ చేసిన ట్వీట్‌కు ఒక్క రోజులోనే 24 వేల రీట్వీట్లు, 48 వేల లైకులు వచ్చాయి. దీని గురించి కాషాయ పార్టీ నేతలు ఏమంటారని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తోంది. ఆ పార్టీ సోషల్ మీడియా వ్యవహరాలను పర్యవేక్షిస్తోన్న దివ్య స్పందన (నటి రమ్య) మాట్లాడుతూ.. ‘10 ట్విట్టర్ ఖాతాలు రాహుల్ ట్వీట్లను పదే పదే రీట్వీట్ చేస్తున్నాయని వార్తలు వస్తున్నాయి. రాహుల్ చేసిన ‘ట్రంప్ ట్వీట్‌’కే అలా వచ్చాయి. ఎలా జరిగిందనేది మాకు తెలియదు. ఈ విషయంలో ట్విటర్ మాత్రమే వివరణ ఇవ్వగలదు.’ అని తెలిపారు.

Modi ji quick; looks like President Trump needs another hug pic.twitter.com/B4001yw5rg — Office of RG (@OfficeOfRG) October 15, 2017
రాహుల్ గాంధీ ట్విట్టర్‌లో అనూహ్యంగా పుంజుకుంటున్న తీరు వివాదాస్పదమైన నేపథ్యంలో.. ‘ట్విట్టర్ ఆడిట్’ ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది. ట్విట్టర్ ఖాతాలను విశ్లేషించి ఎంత మంది నకిలీ ఫాలోవర్లు ఉన్నారని తేల్చే ఈ సంస్థ.. 5 వేల మంది ఫాలోవర్లను రాండమ్‌గా ఎంపిక చేసి రాహుల్ ఆడిట్ స్కోరును 51 శాతంగా తేల్చింది. ఆయనకు 3.8 మిలియన్ల మంద ఫాలోవర్లు ఉండగా.. అందులో 1.8 మిలియన్ల మంది ఫేక్ ఫాలోవర్లని తేల్చింది. ప్రధాని నరేంద్ర మోదీ ఖాతాలకు 37 శాతం స్కోరు ఇచ్చింది. అంటే ఆయనకున్న 35.6 మిలియన్ల ఫాలోవర్లలో 22 మిలియన్ల మంది నకిలీ అని చెప్పింది. ఈ రీసెర్చ్‌ వెనుక కాంగ్రెస్ పార్టీ ఉన్నట్లు తెలుస్తోంది. చివర్లో మరో ఆసక్తికర విషయం ఏంటంటే.. కాంగ్రెస్ పార్టీ కోసం బిగ్ డేటా సంస్థ కేంబ్రిడ్జ్ అనలైటిక పని చేస్తోంది. సదరు సంస్థ అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో ఓటర్ల నాడిని పట్టడం కోసం డొనాల్డ్ ట్రంప్‌కు సహకరించింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.