యాప్నగరం

Railway Employee Cheating ప్రయాణికుడు రూ.500 నోటు ఇస్తే.. రూ.20గా చూపించి కాజేసిన ఉద్యోగి.. వీడియో వైరల్

Railway Employee Cheating టికెట్‌ కౌంటర్‌లోని ఉద్యోగి అవసరమైతే ప్రయాణికులకు కొన్ని సూచనలు చేసి వారి ప్రయాణం మరింత సౌకర్యవంతంగా మారేలా బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. అలా చేయలేదు సరికదా మోసపూరితంగా వ్యవహరించి ప్రయాణికుడి సొమ్మును కొట్టేశాడు. ఈ ఘటన ఢిల్లీలోని ఓ రైల్వే స్టేషన్‌లో జరిగింది. దీనిని వీడియో తీయడంతో అతడి బండారం బయటపడింది. ప్రయాణికుడు రూ.500 నోటు ఇస్తే.. అతడ్ని మాటల్లో పెట్టి రూ.20 ఇచ్చావని బుకాయించడం గమనార్హం.

Authored byఅప్పారావు జివిఎన్ | Samayam Telugu 28 Nov 2022, 6:57 am

ప్రధానాంశాలు:

  • టిక్కెట్ కోసం రూ.500 నోటు ఇచ్చిన ప్రయాణికుడు
  • మాటల్లో పెట్టి రూ.20 ఇచ్చావని బుకాయింపు
  • వీడియో వైరల్ కావడంతో అధికారులు చర్యలు
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Railway Empolyee
Railway Employee Cheating కౌంటర్‌లో రైలు టిక్కెట్ కొనుగోలు చేయడానికి వచ్చిన ప్రయాణికుడ్ని అక్కడ ఉద్యోగి మోసగించాడు. ప్రయాణికుడు రూ.500 నోటు ఇస్తే.. మాటల్లో పెట్టి రూ.20 ఇచ్చావని బుకాయించాడు. ఈ ఘటన ఢిల్లీలోని హజ్రత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్‌లో చోటుచేసుకోగా.. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. హజ్రత్‌ నిజాముద్దీన్‌ రైల్వేస్టేషన్‌లో టికెట్‌ కోసం వచ్చిన ప్రయాణికుడు రూ.500 నోటు ఇచ్చి ఇచ్చి గ్వాలియర్‌ సూపర్‌ఫాస్ట్‌ రైలుకు టికెట్‌ ఇవ్వమని కోరాడు. కౌంటర్‌లో ఉన్న ఉద్యోగి ఆ ప్రయాణికుడ్ని మాటల్లో పెట్టి.. రూ.500 కొట్టేశాడు.
తన వద్దనున్న రూ.20 నోటును బయటకి తీసి.. ఇది టికెట్‌కు సరిపోదని, మరో రూ.100 ఇవ్వాలని ప్రయాణికుణ్ని డిమాండ్‌ చేశాడు. మంగళవారం జరిగిన ఈ ఘటన తాజాగా బయటకు వచ్చింది. దీనికి సంబంధించిన వీడియోను ‘రైల్‌విష్పర్స్‌’ అనే ట్విటర్‌ హ్యాండిల్‌లో పోస్టు చేయడంతో వైరల్‌ అయ్యింది. దీనిని ఉన్నతాధికారులతో పాటు రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను కూడా ట్యాగ్‌ చేయడంతో స్పందించారు. సంబంధిత టికెట్‌ బుకింగ్‌ క్లర్క్‌పై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటున్నట్లు ట్విటర్‌ వేదికగా వెల్లడించారు.


టికెట్‌ కౌంటర్‌లో పని చేసే ఉద్యోగి అవసరమైతే ప్రయాణికులకు కొన్ని సూచనలు చేసి వారి ప్రయాణం మరింత సౌకర్యవంతంగా మారేలా బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సింది పోయి.. మోసపూరితంగా వ్యవహరించడం పట్ల నెటిజన్లు మండిపడుతున్నారు. అతడు చేసిన పని అతడి మోసపు బుద్ధికి అద్దం పడుతోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చెన్నై రైల్వే స్టేషన్‌లో ఇలాంటివి చాలాసార్లు జరిగాయని, కొంతమంది రైల్వే ఉద్యోగుల సంఘటిత గుండాయిజం ఇటువంటి నేరాలకు పాల్పుడుతున్నారని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.


‘‘చాలా ప్రమాదకరం.. నేను తొలిసారి ఇటువంటిది చూస్తున్నాను.. ఒకవేళ వీడియో రికార్డు చేయకపోయింటే ఏం జరిగేది.. అటువంటి వ్యక్తులు ఇతరుల సొమ్మును మోసపూరితంగా కాజేయడం సిగ్గుచేటు’’ అని మరో నెటిజన్ వ్యాఖ్యానించాడు.

Read Latest National News And Telugu News
రచయిత గురించి
అప్పారావు జివిఎన్
జీవీఎన్ అప్పారావు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ జాతీయ, అంతర్జాతీయ అంశాలకు సంబంధించిన తాజా వార్తలు, కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 10 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో విద్య, జాతీయ రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.