యాప్నగరం

ఏప్రిల్ నుంచి అన్ని రైళ్లు పునరుద్ధరణ.. రైల్వే శాఖ క్లారిటీ

Indian Railways రైల్వే శాఖ ఏప్రిల్ నుంచి అన్ని సర్వీసులను నడిపేందుకు సిద్ధమౌతోందని, పూర్తి స్థాయి ట్రైన్ సర్వీసులను అందుబాటులోకి తీసుకురానుందనే ప్రచారం జోరుగా సాగుతోంది.

Samayam Telugu 14 Feb 2021, 10:39 am

ప్రధానాంశాలు:

  • ఏప్రిల్ నుంచి పూర్తిస్థాయిలో రైళ్లు నడపనున్నట్టు ప్రచారం.
  • మీడియాలో జరుగుతున్న ప్రచారంపై స్పందించిన రైల్వే.
  • రైళ్ల పునరుద్ధరణపై రైల్వే శాఖ కీలక ప్రకటన.
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu రైలు సర్వీసులు
Indian Railways is leaving no stone unturned to enhance the passenger experience.
కరోనా వైరస్ కట్టడికి విధించిన లాక్‌డౌన్ కారణంగా గతేడాది మార్చి 25 నుంచి సాధారణ రైలు సర్వీసులను రైల్వే శాఖ నిలిపివేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ప్రత్యేక రైళ్లను మాత్రమే నడుపుతోంది. అయితే, ఏప్రిల్ నుంచి పూర్తిస్థాయిలో రైళ్లను అందుబాటులోకి తీసుకురానున్నట్టు మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో మీడియాలో వస్తున్న కథనాలపై రైల్వే శాఖ స్పందించింది. మీడియాలో వచ్చిన కథనాలను తోసిపుచ్చిన రైల్వే శాఖ.. ఫలానా తేదీ అని తాము నిర్ణయించలేదని పేర్కొంది.
పుల్వామా ఘటనకు రెండేళ్లు.. 40 మంది భారత సైనికులు అమరులైన రోజు
ఏప్రిల్‌‌లో ఫలానా తేదీ నుంచి అన్ని రైళ్లను ప్రారంభిస్తారంటూ కొన్ని రోజులుగా మీడియాలో వార్తలు వస్తున్నాయని రైల్వే శాఖ పేర్కొంది. అయితే, తాము ఎటువంటి తేదీని నిర్ణయించలేదని స్పష్టం చేసింది. ఇప్పటికే 65 శాతం రైళ్లు అందుబాటులో ప్రయాణికులకు అందుబాటులో ఉన్నాయని తెలిపింది. జనవరిలో 250 రైళ్లను ప్రారంభించామని, దశలవారీగా రైళ్లను అందుబాటులోకి తెస్తున్నామని వివరించింది. అదే తరహాలో భవిష్యత్‌లో సైతం మిగితా రైళ్లను అందుబాటులోకి తీసుకొస్తామని వెల్లడించింది.

అరేబియా సముద్రంలో నౌకలో అగ్ని ప్రమాదం.. ప్రమాదంలో సెయిలర్లు
అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందని, అందరి అభిప్రాయాలను తీసుకుంటామని రైల్వే మంత్రిత్వ శాఖ తెలిపింది. కోవిడ్‌ నేపథ్యంలో రైళ్లన్నీ పూర్తిగా నిలిచిపోగా.. ప్రస్తుతం ప్రత్యేక రైళ్ల పేరిట కొన్ని రైళ్లు అందుబాటులోకి వచ్చిన సంగతి తెలిసిందే. కరోనా కారణంగా ప్రయాణికుల వల్ల రైల్వేకు వచ్చే ఆదాయం గణనీయంగా పడిపోయింది. 2019-20 ఆర్ధిక సంవత్సరంతో పోల్చితే డిసెంబరు 2020 నాటికి రైల్వే ఆదాయం రూ.36,993 కోట్ల కోల్పోయింది. ఇందులో ప్రయాణికుల ఆదాయమే రూ.32,768.97 కోట్లు తగ్గిపోయింది.

విదేశీ పౌరసత్వం కోసం ఎగబడుతోన్న భారతీయ ధనికులు.. నివేదికలో ఆసక్తికర విషయాలు!
కరోనా వైరస్ నేపథ్యంలో ప్రత్యేక రైళ్ల సేవలను మరికొంతకాలం కొనసాగించనున్నారు. క్రమంగా వీటిని పెంచుకుంటూ వస్తున్నారు. తొలుత లాక్‌డౌన్ ఆంక్షలు సడలించిన తర్వాత గతేడాది మే 15 నుంచి రైళ్లను పునరుద్దరించి, ప్రత్యేక రైళ్లు పేరుతో వీటిని నడుపుతున్నారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ప్రస్తుతం దేశవ్యాప్తంగా 65 శాతం రైలు సేవలు అందుబాటులోకి వచ్చాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.