యాప్నగరం

ఆ 13 వేల మంది ఉద్యోగులను సాగనంపనున్న రైల్వే!

క్రమశిక్షణా చర్యల్లో భాగంగా నిబంధనలను అతిక్రమించిన ఉద్యోగులపై రైల్వే శాఖ కొరడా ఝలిపించనుంది. ఎలాంటి సమాచారం లేకుండా అనధికారికంగా సెలవుల్లో ఉన్న ఉద్యోగులను తొలగించడానికి ప్రయత్నాలు ప్రారంభించింది.

TNN 10 Feb 2018, 12:42 pm
క్రమశిక్షణా చర్యల్లో భాగంగా నిబంధనలను అతిక్రమించిన ఉద్యోగులపై రైల్వే శాఖ కొరడా ఝలిపించనుంది. ఎలాంటి సమాచారం లేకుండా అనధికారికంగా సెలవుల్లో ఉన్న ఉద్యోగులను తొలగించడానికి ప్రయత్నాలు ప్రారంభించింది. ఇందులో భాగంగా సెలవులో ఉన్న 13వేల మంది ఉద్యోగులను గుర్తించిన రైల్వే శాఖ వారిని త్వరలోనే విధుల నుంచి బహిష్కరిస్తుందని విశ్వసనీయ వర్గాలు పేర్కొంటున్నాయి. వివిధ విభాగాల్లోని దీర్ఘకాలిక సెలవుల్లో ఉన్న ఉద్యోగులకు గుర్తించి, వారిపై చర్యలు తీసుకోవాలని రైల్వే మంత్రి పియూశ్ గోయల్ అధికారులను ఆదేశించడంతో యంత్రాంగం సమాయత్తమైంది. ఇందు కోసం రైల్వేల పనితీరు, ఉద్యోగుల్లో నిబద్ధతను పెంచేందుకు ఆ శాఖ ఓ డ్రైవ్‌ చేపట్టింది. దీంతో చాలా కాలంగా సెలవులో ఉంటున్న సిబ్బంది వివరాలను సేకరించింది.
Samayam Telugu railways to sack 13000 employees on long unauthorised leave
ఆ 13 వేల మంది ఉద్యోగులను సాగనంపనున్న రైల్వే!


మొత్తం 13 లక్షల మంది ఉద్యోగుల్లో 13వేల మంది దీర్ఘకాలం అనధికారికంగా సెలవులో కొనసాగుతున్నట్లు గుర్తించామని, వారిపై క్రమశిక్షణ చర్యలను తీసుకుని, విధుల నుంచి తొలగించాలని భావిస్తున్నామని రైల్వే శాఖ ఓ ప్రకటన వెలువరించింది. విధుల నుంచి ఈ జాబితాలోని వారి పేర్లను తొలగించాలని ఇప్పటికే సంబంధిత అధికారులకు సూచనలు, ఆదేశాలు జారీచేసినట్లు తెలుస్తోంది. ఇటీవల ఇద్దరు ఐపీఎస్ అధికారుల పనితీరు సక్రమంగా లేకపోవడంతో వారిచే బలవంతంగా రాజీనామా చేయించిన విషయం తెలిసిందే. ఇదే విధానాన్ని రైల్వేలోనూ అనుసరించాలని భావిస్తున్నారు. ఉద్యోగుల్లో జవాబుదారీతనం పెంచడానికి ఈ చర్యలు చేపట్టడం విశేషం.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.