యాప్నగరం

తక్కువ వర్షపాతం, అధిక వేడికి కారణం ఇదే

సాధారణంగా వర్షాకాలంలో మేఘాలు తక్కువ ఎత్తులో ఏర్పడినప్పుడు అధికంగా వర్షాలు కురిస్తాయి. అయితే వాతావరణంలో మార్పులు కారణంగా మేఘాలు అస్తవ్యస్తంగా మారాయి.

Samayam Telugu 15 Jun 2017, 12:14 pm
సాధారణంగా వర్షాకాలంలో మేఘాలు తక్కువ ఎత్తులో ఏర్పడినప్పుడు అధికంగా వర్షాలు కురిస్తాయి. అయితే వాతావరణంలో మార్పులు కారణంగా మేఘాలు ఏర్పడే విధానంలో అసమానతలు ఉన్నట్లు 50 ఏళ్ల గణాంకాల పరిశీలన అధారంగా భారత వాతావరణ శాఖ చేపట్టిన అధ్యయనంలో వెల్లడైంది. దీని వల్ల ఎక్కువ రోజులు వేడిగానూ, తక్కువ వర్షపాతం కురుస్తోందని, చాలా రోజుల రాత్రి పగటి ఉష్ణోగ్రతల్లోనూ వ్యత్యాసం ఉన్నట్లు తేలింది. వర్షాకాలంలో 70 శాతం వర్షపాతం కురిస్తే, పంజాబ్ నుంచి బీహార్ వరకు విస్తరించి ఉన్న ఉత్తర మైదాన ప్రాంతంలో తక్కువ ఎత్తులో మేఘాలు ఏర్పడటమనేది ప్రతీ దశాబ్దానికి 4 నుంచి 8 శాతం పెరుగుతున్నట్లు గుర్తించారు.
Samayam Telugu rain clouds thinning out in west and central india
తక్కువ వర్షపాతం, అధిక వేడికి కారణం ఇదే


కానీ పశ్చిమ తీరం, మధ్య భారతంలో ప్రతీ దశాబ్దానికి 4 నుంచి 6 శాతం వంతున తగ్గుతూ వస్తోంది. దీని వల్ల తక్కువ వర్షపాతం, ఎక్కువ వేడి ఉంటుంది. ఈ పరిస్థితులపై వాతావరణ శాఖ ఆందోళన వ్యక్తం చేస్తోంది... ఎందుకంటే దేశంలోని సగానికిపైగా ప్రాంతాల్లోని రైతులు వర్షాలుపైనే ఆధారపడి పడతారు. అల్ప లేదా అధిక వర్షపాతం పంటల దిగుబడిపై ప్రభావం చూపి ఆహార భద్రత, ఆర్ధికవ్యవస్థను చిన్నాభిన్నం చేస్తుంది. సాధారణంగా వర్షించే మేఘాలు 6,500 అడుగుల ఎత్తులో ఏర్పడతాయి.


అయితే వీటి అధ్యయనం చాలా క్లిష్టమైంది కానీ అధిక ఉష్ణోగ్రత, తక్కువ వర్షపాతం లాంటి మార్పులపై దీని ప్రభావం ఎక్కువే. భారత వాతావరణ శాఖకు చెందిన ఏకే జైస్వాల్, పీఏ కోరే, వీరేంద్ర సింగ్‌లు ఈ అధ్యయనంలో పాల్గొన్నారు. ఓ ప్రాంతంలో పెరగడానికి, మరో ప్రాంతంలో తగ్గడానికి గల కారణాలను మాత్రం వీళ్లు వివరించలేదు. అయినప్పటికీ పొగ, దూళితో ఏర్పడే తుంపరలు దీనికి కారణమవుతున్నాయని పేర్కొన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.